పరీక్షల సమయం, ఎలాంటి ఆహారం ముఖ్యం
అసలే ఇది ఎగ్జామ్స్ టైమ్. పబ్లిక్ పరీక్షల్లో ఎలాగైనా పాసవ్వాలని పిల్లలు పుస్తకాలతో కుస్తీపడుతుంటారు. రాత్రి, పగలు చదువుతుంటారు. ఈ సమయంలో చాలా మందిలో పరీక్షల టెన్షన్, ఒత్తిడి కనిపిస్తుంది. అందుకే వారికి శక్తితో కూడిన, ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలను ఇవ్వాలి. అవేంటో చూద్దాం.
• పప్పుధాన్యాలు, సోయా గింజలు, పెరుగు, పాలు, నూనె గింజల్లో మేలైన మాంసకృతులు ఉంటాయి. ఇవి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. పెసరట్టు, మినపట్టు, ఉడకబెట్టిన వేరుశనగలు, గుగ్గిళ్లు, అలసందలు కూడా ఇవ్వొచ్చు.
• నట్స్, నువ్వులు, మరమరాలు, జొన్న పేలాలు, బటానీలు ఇవ్వాలి.
• రోజూ సరిపడా నీరు తాగాలి. నిమ్మకాయ నీరు కూడా రోజుకు కనీసం ఓసారి తాగడం మంచిది. జ్యూస్ల కంటే పండ్లను నేరుగా తినాలి.
• పులిహోర, బిర్యానీ, పూరీ, వడ వంటి ఎక్కువ ఆయిల్తో చేసే పదార్థాలను దూరం పెట్టడం మంచిది. అందుబాటులో ఉండే పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినడం బెటర్.
• చికెన్, చేపలు, గుడ్లతో చేసిన కూరలు తినేటప్పుడు రైస్ తక్కువగా తినండి. లేకుంటే నిద్ర ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
0 Comments