తిమింగలం విశేషాలు
● నీలి తిమింగలం ప్రపంచంలోని జంతువులన్నిట్లోకీ పెద్దది. ఏకంగా 200 టన్నుల బరువు ఉంటుంది
● ఒక్కో తిమింగలం రోజుకు నాలుగు టన్నుల చేపల్ని తింటుంది
● ఇవి నీటిలో తేలియాడుతూ నిద్రపోతాయి
● శ్వాస తీసుకోకుండా గంటన్నర వరకూ ఉండగలవు
● తిమింగలం గుండె 180 కిలోల బరువుంటుంది
● పిల్ల తిమింగలం రోజుకు సుమారు 200 లీటర్ల వరకూ తల్లి పాలు తాగుతుంది
● ఇవి 90 ఏళ్లదాకా బతుకుతాయి.
● తిమింగలాలు పాటలు పాడతాయి`
★ తిమింగలాలు నోరు తెరిచి పాడాయంటే చాలా దూరం వినిపిస్తుంది. అవి పాటలు పాడుతూ నీళ్లలో విన్యాసాలు చేస్తుంటాయి. ఇవి పాడే పాటలకూ ప్రత్యేకత ఉండటంతో ఇదెలా సాధ్యమని పరిశోధకులు అధ్యయనం చేశారు. అవి శ్వాస తీసుకున్నప్పుడు, వదిలేటప్పుడు U-ఆకారపు కణజాలాన్ని బలంగా నెట్టడం ద్వారా తిమింగలం వాయిస్ బాక్స్ పనిచేస్తోందని తేల్చారు. అవి ఏ ప్రాంతంలో ప్రయాణిస్తుంటే ఆ ప్రాంతంలో విన్పించే శబ్దాలను బట్టి ట్యూన్ మార్చుకుంటాయట.
0 Comments