GET MORE DETAILS

గోధుమ గడ్డి నుంచి తీసిన రసం ఆరోగ్యానికి చాలా మంచిది

 గోధుమ గడ్డి నుంచి తీసిన రసం ఆరోగ్యానికి చాలా మంచిది



భారతదేశంలో ఎక్కువగా పండించే ధాన్యాలలో గోధుమలు ఒకటి. భారతదేశంతో బాటు చైనా, అమెరికా, రష్యాలలో కూడా గోధుమ లను విస్తారంగా పండిస్తారు. గోధుమలను, గోధుమపిండిని ప్రపంచవ్యా ప్తంగా చాలా దేశాలలో వాడతారు. కొన్ని దేశా లలో అయితే గోధుమలే వారి ప్రధాన ఆహారం. మనదేశం విషయానికి వస్తే, దీన్ని ఉత్తర భారత దేశంలో ఎక్కువగా పండించడమే కాకుండా, గోధుమ పిండితో చేసిన రొట్టెలు వారి ప్రధాన ఆహారం. గోధుమ గడ్డిని పశుగ్రాసంగా వాడ తారు. ఇళ్ల పైకప్పుగా వాడతారు. గోధుమ గడ్డి నుంచి తీసిన రసం ఆరోగ్యానికి చాలా మంచిది. గోధుమ రవ్వతో ఉప్మా చేస్తారు. లడ్డూలు కూడా తయారు చేస్తారు. బ్రెడ్ తయారీకి కూడా గోధుమలే వాడతారు. అంతే కాదు, అత్యంత బలవర్ధక మైన ఆహారం గోధుమలు. ఎదిగే పిల్ల లకు గోధుమలు ఎంతో ఉపయోగపడ తాయి. ఎముకల పెరుగుదలకు, రక్తహీ నతకు, మలబద్ధకానికి ఆయుర్వేదంలో గోధుమలను ఉపయోగించి రకరకాల ఔష ధాలను తయారు చేస్తారు. గోధుమలలో అత్యధి కంగా బీకాంప్లెక్స్ విటమిన్లు, ప్రొటీన్లు, పీచుపదా ర్థాలు ఉంటాయి. గోధుమ లడ్డూలు ఎంతో రుచి కరమైన చిరుతిండి. ఒక్కముక్కలో చెప్పాలంటే గోధుమల ఉపయోగాలు అన్ని, ఇన్ని అని చెప్పలేం. భిన్నమైన వాదనలు వినిపిస్తున్నప్పటికీ బరువు తగ్గాలనుకునేవారు ఒకపూట అన్నం తినడం మాని గోధుమ రొట్టెలను తినడం మనకు అనుభవంలో ఉన్నదే. అంతెందుకు, గోధుమరొ ట్టెలు తినేవారు వరి అన్నం తినేవారికన్నా బలంగా, ఆరోగ్యంగా ఉండటం కూడా తెలిసిందే.

Post a Comment

0 Comments