GET MORE DETAILS

గంజిని పారబోయకండి

 గంజిని పారబోయకండి



సాధారణంగా ప్రతి ఇంట్లో అన్నం వండేటప్పుడు వచ్చే గంజి నీటిని పారబోస్తుంటారు. అలా చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. గంజి నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. ఈ నీటిలో మన శరీరానికి ఉపయోగపడే పోషకాలు అధిక మోతాదులో ఉన్నాయని వారు చెప్తున్నారు. అందువల్ల గంజినీటిని పారబోయకుండా వాటిని గోరువెచ్చగా ఉండగానే అందులో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే మంచిది. గంజి నీటిలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి కావలసిన పోషణని పుష్కలంగా అందిస్తాయి. ముఖ్యంగా శరీరంలో విటమిన్ లోపాలు రాకుండా కాపాడుతాయి. ఈ గంజి నీటిని తరచు చిన్నారులకు తాగిస్తుంటే.. వారి ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. ఇక పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటిని అయినా తాగించాలి. అప్పుడే వారికి కావల్సిన ఆహారం అంది శక్తి లభిస్తుంది. తరచు చాలామంది చర్మం సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే.. చర్మ దురదలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. దురద ఉన్న ప్రాంతంలో కొద్దిగా గంజినీటిని పోసి సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం. వల్ల చర్మంపై దురదలు తగ్గిపోతాయి.

విరేచనాల సమస్యతో బాధపడేవారు గంజి నీటిని తాగితే వెంటనే విరేచనాలు తగ్గుతాయి.

Post a Comment

0 Comments