GET MORE DETAILS

పోస్టల్ బ్యాలెట్ పొందడం ఇలా...

 పోస్టల్ బ్యాలెట్ పొందడం ఇలా...



పోస్టల్ బ్యాలెట్లు పొందడానికి ఫారం-12 డిలు సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమరి ్పంచాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులో వ్యక్తిగత వివరాలు, ఓటరు గుర్తింపు సమాచారం, పోస్టల్ బ్యాలెట్ ఎందుకు కోరుతున్నారో చెప్పాల్సి ఉంటుంది. రిటర్నింగ్ అధికారి వాటిని పరిశీలించి అర్హత ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ మంజూరు చేస్తారు. సర్వీసు ఓటర్లకు రిటర్నింగ్ అధికారి రికార్డు ఆఫీసు ద్వారా నేరుగా పంపుతారు. భారత దేశం వెలుపల విధులు నిర్వర్తిస్తున్న సర్వీసు ఓటర్లకు విదే శాంగశాఖ ద్వారా పోస్టల్ బ్యాలెట్లు పంపు తారు. ఇక 85+ వారి ఇంటి వద్దకే ఇద్దరు పోలింగ్ అధికారులు, వీడియోగ్రాఫర్,

సెక్యూరిటీ వచ్చి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. వీరు ఏ తేది, ఏ సమయంలో వచ్చేది ముందుగానే సమాచారం ఇస్తారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్లతోపాటు డిక్లరేషన్ ఫారం, సీక్రసీ స్లీవ్, ప్రీ పెయిడ్ రిటర్న్ ఎన్వలప్లను రిటర్నింగ్ అధికారి ఓటర్ల చిరునామాకు పం పుతారు. ఓటరు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి డిక్లరేషన్ ఫారం భర్తీ చేయాలి. బ్యాలెట్ పేపరు, డిక్లరేషన్ ఫారం, సీక్రసీ స్లీవ్లో ఉంచి దాన్ని ప్రీపెయిడ్ ఎన్వలప్లో ఉంచాలి. ఆ కవరుపై సరిపడు పోస్టల్ స్టాంప్ అంటించి సకాలంలో తిరిగి పంపాల్సి ఉం టుంది. పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ కేంద్రం లో ప్రత్యేకంగా లెక్కిస్తారు.

Post a Comment

0 Comments