GET MORE DETAILS

నగల దుకాణంలో దొరకని ఆభరణం

 నగల దుకాణంలో దొరకని ఆభరణం




మన కుటుంబాల్లో నాకు ఎక్కువగా కనిపించే దృశ్యం ఇది : కూతుళ్లు తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తారు, కొడుకులు తల్లిని ఎక్కువగా ప్రేమిస్తుంటారు. అలాగే తండ్రులు కూతుళ్ళను, తల్లులు కొడుకులను ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

ప్రతి తండ్రి తన కూతురిలో తన తల్లిని, ప్రతి తల్లి తన కొడుకు లో తన తండ్రిని వెతుక్కొంటూ వుంటుంది అని నా అభిప్రాయం. కొన్ని కుటుంబాల్లో ఇది భిన్నంగా ఉండవచ్చు.

సరే. ఇది వ్రాయడానికి కారణం వుంది. మొన్న బెంగళూరు జయనగర్ లోని ఒక ప్రముఖ ice cream parlor లోనికి ఒక పెద్దాయన తన కూతురితో పాటు వచ్చాడు. రద్దీగా వున్నా, వాళ్లిద్దరూ అందరిలాగే కొంత కాచుకొని ice cream కొనుక్కొని, దుకాణం లో ఒక మూలకు కూర్చొని ice cream తిని వెళ్లిపోయారు.

ఆ పెద్దాయన నడిపే సంస్థ యొక్క ప్రస్తుత market cap విలువ ఎంతంటే అక్షరాలా 84.28 బిలియన్ డాలర్లు.

అంత సంపన్నమైన కంపెనీకి founder ఆయనే, అధిపతీ ఆయనే. కానీ ఆయన మాత్రం చాలా సాధారణమైన అడ్డపంచె కట్టుకొని ఒక మధ్యతరగతి తండ్రి లాగా వచ్చాడు.

అయన పేరు నారాయణ మూర్తి. (నాగవర రామారావు నారాయణ మూర్తి ) ఆయన సంస్థ పేరు Infosys.

ఇక ఆయన కూతురంటారా? ఆమె పేరు అక్షతా మూర్తి. స్వయాన బ్రిటన్ ప్రధానమంత్రి ఋషి సునాక్ భార్య. 

అంత పెద్ద హోదాలో వున్న ఆమె ఎంత మిడిసిపడొచ్చు! లేదు. చాలా నిరాడంబరంగా, స్కూల్ వదిలిన తరువాత, తనని తీసుకెళ్లాడానికి వచ్చిన తండ్రి తో దగ్గర్లోని ఒక పెట్టెబంకు దగ్గర పుల్లయిస్ తింటున్న ఒక చిన్న మధ్య తరగతి అమ్మాయి లాగా కనిపించట్లేదూ  ?

కానీ మనం ఈరోజుల్లో చూసే చాలా మంది ఎలా వుంటున్నారు?

వాళ్ళ మాటల్లో, వ్యవహారం లో ఎంత అహంభావం వుంటుంది!  ఆవగింజంత మాత్రమే తెలిసినా  ఆకాశానికి ఎగురుతుంటారు !

వాళ్ళ డబ్బు, ఇళ్ళు, కార్లు, అందం, ఐశ్వర్యం శాశ్వతం అన్నట్టు ప్రవర్తిస్తుంటారు !

ఈ లోకంలో ఏ నగల వ్యాపారి, ఏ నగల దుకాణమూ అమ్మని, అమ్మలేని అత్యంత విలువైన ఆభరణాల్లో ఒకటి - నిరాడంబరత (simplicity)

కానీ మీతో ఒక మాట చెప్పుకోవాలి. రవీంద్రనాథ్ టాగోర్ అన్నట్టు...

It is simple to be happy, but it is very difficult to be simple



Post a Comment

0 Comments