GET MORE DETAILS

04-03-2024 - సోమవారం - రాశి ఫలితాలు

 04-03-2024 - సోమవారం - రాశి ఫలితాలు 

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈



మేషం:

సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత  పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.  వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు అవరోధాలు తొలగుతాయి.

---------------------------------------

వృషభం:

దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు నుండి కొంతవరకు బయటపడగలుగుతారు.  ఉద్యోగాలలో అధికారులనుండి విమర్శలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.

---------------------------------------

మిధునం:

ఋణ దాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు కొంత చాలాకష్టం మీద పూర్తిఅవుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

---------------------------------------

కర్కాటకం:

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.   సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. వృత్తి సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన పురోగతిలో సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

---------------------------------------

సింహం:

నిరుద్యోగ  ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు.  వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన  వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

కన్య:

వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.  ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్ధిక వ్యవహారాలలో  ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన వ్యవహారాలలో  శ్రమాధిక్యత పెరుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి.

---------------------------------------

తుల:

మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది.   దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------

వృశ్చికం:

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు  పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం  ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. సోదరుల నుండి  శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

---------------------------------------

ధనస్సు:

నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం  కొంత  గందరగోళంగా ఉంటుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన  పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి.

---------------------------------------

మకరం:

సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో  ఆశించిన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు.

---------------------------------------

కుంభం:

వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు చేదాటుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం జీవిత భాగస్వామితో  అకారణ వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

మీనం:

నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున  శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.  ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతంకంటే మెరుగవుతుంది. విలువైన  గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

Post a Comment

0 Comments