వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్
మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన వినియోగదారులకు మరో సదుపాయాన్ని అందించడానికి సిద్ధమైంది. యూజర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్టేటస్అప్డేట్ టైంను పెంచనుంది. ప్రస్తుతం 30 సెకన్లు నిడివి కలిగిన వీడియోలను మాత్రమే స్టేటస్ పెట్టుకోడానికి అవకాశం ఉంది. అయితే, 60 సెకన్లు కలిగిన వీడియోలను స్టేటస్ గా పెట్టుకోడానికి కొత్త ఫీచరు త్వరలో విడుదల చేయబోతుందని సమాచారం. ప్రస్తుతం బీటా వెర్షన్ 2.24.7.3ను డౌన్లోడ్ చేసుకున్న యూజర్లకు అందుబాటులోకి రాగా, త్వరలో మిగతా వారికి విడుదల అవుతుందని కంపెనీ పేర్కొంది.
వాట్సప్లో మరిన్ని మెసేజ్లు పిన్:
వాట్సప్ ప్రియులకు శుభవార్త ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ లాట్స్, మెసేజ్లను పిన్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్' దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. ప్రస్తుతానికి 2.24.6.15 లేదా అంతకన్నా తర్వాతి వాట్సప్ వర్షన్లు గల కొందరికిది అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన ఛాటి, " మెసేజ్లకు ప్రాధాన్యం ఇవ్వటానికి, వాటిని అన్నింటికన్నా పైన కనిపించేలా చూసుకోవటానికిది తోడ్పడుతుంది. తాజా వాట్సప్ బీటా వర్షన్ అందుబాటులో గలవారు ఈ ఫీచర్ ద్వారా ఒక్కో చాట్కు మూడు వరకూ మెసేజ్ ల చొప్పున.. ఐదు చాట్స్ న్ను పిన్ చేసుకోవచ్చు. కొత్త పీచర్ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ తరచూ వాట్సప్ యాస్ నన్ను అప్డేట్ చేసి పొందొచ్చు. వాట్సప్లో మెసేజ్ను పిన్ చేసుకోవాలంటే ఛాటు ఓపెన్ చేసి, పిన్ చేసుకోవాలనుకునే మెసేజ్ను ఎంచుకోవాలి. చాట్ పైభాగాన కనిపించే పిన్ గుర్తు మీద క్లిక్ చేస్తే 24 గంటలు, 7 రోజులు, 30 రోజులు అనే ఆప్షన్లు ప్రత్యక్షమవుతాయి. అవసరమైన ఆప్షన్ను ఎంచుకుంటే సరి. ఒకవేళ పిన్ చేసిన మెసేజ్ ను వద్దనుకుంటే- దాని మీద క్లిక్ చేసి, అనిన్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఇది యాప్లోనే కాదు, వెబ్ వర్షన్లోనూ పనిచేస్తుంది.
టెక్స్ట్ రూపంలో వాయిస్ మెసేజ్:
వాట్సాప్లో ఒక్కో సారి అత్యవసరంగా 'వాయిస్' రూపంలో సందేశాన్ని పంపుతాం. స్నేహితుడు లేదా ఆఫీస్లో పై అధికారికి అత్యవసరంగా ఓ వాయిస్ మెసేజ్ను పంపాల్సి వచ్చినప్పుడు, ఆ సందేశాన్ని చూసి.. దానిని ఓపెన్ చేయక పోతే, అందులోని విషయం తెలుసుకునే అవకాశం లేదు. దీనికి పరిష్కారంగా వాట్సాప్ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ వాయిస్ మెసేజ్ను.. టెక్స్ట్ ఫార్మాట్లోకి మార్చటం. ఈ ఫీచర్ తొలుత 'ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టం' ఉన్న యాపిల్ ఫోన్లలో ఇప్పటికే ప్రవేశపెట్టారు. యాపిల్ ఫోన్లలో ఈ ఫీచర్ విజయవంతం కావటంతో, ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ తీసుకురావటంపై పరీక్షలు మొదలయ్యాయి. ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ కొత్త ఫీచర్ పరి చయం చేసేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తున్న దని టెక్ వర్గాలు వెల్లడించాయి. టెక్స్ట్ రూపంలో పరస్పర సందేశాలను ఇష్టపడే వ్యక్తులకు ప్రత్యామ్నాయ సమాచార మార్గంగా ఇది నిలుస్తుందని వాట్సాప్ వర్గాలు భావిస్తున్నాయి.
0 Comments