GET MORE DETAILS

95 ఏళ్ల వయసులో మనము అయితే...కంప్లీట్ రెస్ట్ కదా...

 95 ఏళ్ల వయసులో మనము అయితే...కంప్లీట్ రెస్ట్ కదా...95 ఏళ్ల వయసులోనూ రోజు రాను పోను 145 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విజయనగరం జిల్లా సెంచురియన్ యూనివర్సిటీలో రెండు వుతకర్రల సాయంతో నడుస్తూ విద్యార్థుల కు ఫిజిక్స్ పాటలు చెప్తూ.. ప్రపంచంలోనే పెద్ద వయసు గల ప్రాఫిసెర్ గా పెరు తెచ్చుకున్నారు చిలుకూరు శాంతమ్మ గారు. ఈమె చదువు పూర్తి అయ్యాక ఆంధ్ర యూనివర్సిటీ లో ఫిజిక్స్ లెక్చరర్ గా చేరారు. లెక్చరర్ నుండి ప్రాఫిసెర్, ఇన్వెస్టగెటర్ గా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా CSIR, UGC వంటి అనేక కేంద్రప్రభుత్వ విభాగాలలో కూడా పని చేసారు. శాంతమ్మ గారికి 2016 లో వెటరన్ సైటిస్ట్ కేటగిరీలో గోల్డ్ మెడల్ ఇచ్చారు. శాంతమ్మ గారి భర్త తెలుగు ప్రొఫెసర్ కావడం తో పురాణాలు, వేదాలు , ఉపనిషత్తులు పై కూడా ఆసక్తి పెంచుకున్నారు. భగవద్గీత శ్లోకాలు ఇంగ్లీష్ లోకి అనువదించి భగవద్గీత ది డివైన్ డైరెక్టీవ్ అనే పుస్తకాన్ని రచించారు. శాంతమ్మ గారికి డబ్బు,ఆస్తి  మీద ఆసక్తి లేకపోవడం వలన ఆమె ఇంటిని వివేకానంద మెడికల్ ట్రస్ట్ కి విరాళంగా ఇచ్చి ఆమె కూడా అదే ఇంట్లో వుంటున్నారు.

Post a Comment

0 Comments