GET MORE DETAILS

ఓటర్ గుర్తింపు కార్డు లేకపోయినా ఓటేయవచ్చు

 ఓటర్ గుర్తింపు కార్డు లేకపోయినా ఓటేయవచ్చు



• 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలి.

• లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల గుర్తింపు కార్డులను నోటిఫై చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.

నూటికి నూరుశాతం ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డు జారీ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఓటర్ గుర్తింపు కార్డు లేని కారణంగా రాష్ట్రంలో లోక్సభకు, అసెంబ్లీకి త్వరలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే హక్కును నిరాకరించకుండా చూసేందుకు ప్రత్యామ్నాయంగా 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేసేందుకు కేం ద్ర ఎన్నిలక సంఘం నోటిఫై చేసింది.

• ఆధార్ కార్డ్

• మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ కార్డు

• బ్యాంక్, పోస్టాఫీసు జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ బుక్ 

• కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేయబడిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్

• డ్రైవింగ్ లైసెన్స్, 

• పాన్ కార్డ్

• ఎన్పీఆర్ కింద ఆర్డీఐ జారీచేసిన స్మార్ట్ కార్డ్ 

• భారతీయ పాస్ పోర్ట్ 

• ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్

• కేంద్ర, రాష్ట్రం ద్వారా ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోతో కూడిన సేవా గుర్తింపు కార్డులు

• ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు

• ప్రత్యేక వైకల్యం గుర్తింపు కార్డు

Post a Comment

0 Comments