రైల్వే, డిఫెన్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఏలూరు (ఆర్ఆర్పేట): రైల్వే, డిఫెన్స్ ఉద్యోగాలకు సిద్ధమౌతున్న అభ్యర్థులకు తమ సంస్థ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు నగరానికి చెందిన ఫ్యూచర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ సతీష్ సావిత్రి సరేళ్ల తెలిపారు. స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం రోడ్డులోని సీఎస్ఐ స్కూల్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గం టల వరకు శిక్షణ తరగతులను 6 నెలల పాటు కొన సాగించాలని నిర్ణయించామన్నారు. పూర్తి వివా రాల కోసం ఫోన్ నెంబర్ 81439 74622లో సంప్ర దించాలని సంస్థ కార్యదర్శి హుస్సేన్ కోరారు. ఆర్ పీఎఫ్ ఇన్స్పెక్టర్ బాణాల శంకరరావు, జిల్లా ఎన్టీఓ నాయకుడు చోడగిరి శ్రీనివాస్, వైమానిక దళ మాజీ అధికారి కసుకుర్తి లక్ష్మయ్య మాట్లాడారు.
0 Comments