ఫోన్ ట్యాపింగ్...! ఇద్దరు వ్యక్తుల ప్రైవేటు సంభాషణ మూడో వ్యక్తి ఎలా వింటున్నాడు...?
ఫోన్ ట్యాపింగ్...! ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్యాపింగ్ మాటున కొందరు అధికారులు సాగించిన దందా.. రోజురోజుకూ వెలుగుచూస్తున్న సంచలన విషయాలు విస్తుగొలుపుతున్నాయి. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు.. ఫిర్యాదుల వంటి విషయాలను పక్కనపెడితే.. అసలు ట్యాపింగ్ కథేంటి? దీనిని ఎలా చేస్తారు? ఇద్దరు వ్యక్తులు ప్రైవేటుగా మాట్లాడుకునే మాటలన్నీ మూడో వ్యక్తి ఎలా వినగలుగుతున్నాడు? ఓసారి చూద్దామా?
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు టెలిఫోన్ లేదా మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ ద్వారా జరిపే సంభాషణలను వారికి తెలియ కుండా రహస్యంగా వినడం, రికార్డు చేయడాన్నే ట్యాపింగ్ అంటారు. వాస్తవానికి ట్యాపింగ్ చేయడం చట్టవిరు ద్ధం. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ట్యాపింగ్ చేయాల్సి వస్తే.. నిర్దేశిత ప్రభుత్వ ఏజెన్సీలు కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలి.
ప్రైవేటు వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాపింగ్ చేయడానికి అనుమతి లేదు. అనుమతి పొందిన ప్రభుత్వ సంస్థలు సైతం ట్యాపింగ్ చేయడానికి బోలెడు నిబంధనలు పాటించాలి. ఎవరి ఫోన్ అయినా గరిష్టంగా 180 రోజులు మాత్రమే ట్యాపింగ్ చేయాలి. పైగా ప్రతి 60 రోజులకు ఓసారి తాజాగా అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అనుమతి లేకుండా గరిష్టంగా 24గంటలకు మించి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ సదరు ట్యాపింగ్‌కు కేంద్ర హోంశాఖ అనుమతి నిరాకరిస్తే అప్పటివరకు రికార్డు చేసిన సంభాషణలన్నీ 48 గంటల్లోగా ధ్వంసం చేయాల్సి ఉంటుంది.
ట్యాపింగ్‌లో రకాలు
సెల్యులర్ ఇంటర్‌సెప్టర్లు:
వీటిని ఐఎంఎస్‌ఐ క్యాచర్స్ లేదా స్టింగ్‌రేస్ అని పిలు స్తారు. టవర్ల ద్వారా ప్రసార మయ్యే నిర్దేశిత మొబైల్ సిగ్నల్స్‌ను ఇవి అడ్డుకుంటా యి. అందు లోని డేటాను క్యాప్చర్ చేయడమే కాకుండా.. మొబైల్ లొకేషన్ కూడా ట్రాక్ చేస్తాయి. కాల్స్‌తో పాటు ఎస్సెమ్మెస్ లను సైతం సంగ్రహిస్తాయి.
వీఓఐపీ ఇంటర్‌సెప్షన్ సాధనాలు:
వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) కమ్యూనికేషన్‌లను సంగ్రహించేందుకు రూపొందించిన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఆధారిత సాధనాలివి. వీఓఐపీ ప్రొటోకాల్స్‌లోని బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇంటర్నెట్‌లో ప్రయాణించే డేటా ప్యాకెట్‌లను ఇవి అడ్డుకుని అందులోని డేటాను సంగ్రహిస్తాయి.
క్లోన్డ్ సిమ్ కార్డులు:
ట్యాపింగ్ చేయాలనుకున్న వ్యక్తి సిమ్‌కు క్లోన్డ్ సిమ్ సంపాదిస్తే చాలు.. సదరు వ్యక్తి మొబైల్ ఫోన్‌కు వచ్చే కాల్స్ అన్నీ చక్కగా వినొచ్చు.
రాజకీయపరమైన నిఘా:
సర్వీస్ ప్రొవైడర్ సహకారంతో రాజకీయ నాయకుల కాల్స్ రికా ర్డు చేస్తారు. ప్రభుత్వం నుంచి దీనికి అనుమతి ఉండదు. అందువల్ల ఇది అక్రమ ట్యాపింగ్.
మానిటరింగ్ సాఫ్ట్‌వేర్:
హానికరమైన సాఫ్ట్‌వేర్ లేదా స్పైవేర్‌ను నిర్దేశిత వ్యక్తి మొబైల్ ఫోన్‌లో వారికి తెలియకుండా చొప్పిస్తారు. ఇవి ఆ ఫోన్ సంభాషణలను రికార్డు చేసి బయటి వ్యక్తు లకు పంపించడంతోపాటు ఫోన్లో ఉన్న సమస్త సమాచారాన్ని మనకు తెలియకుండా బహిర్గతం చేస్తుంది.
అధికారిక ట్యాపింగ్:
ప్రభుత్వ అనుమతి తీసుకుని సర్వీస్ ప్రొవైడర్ సహకారంతో చేసే ట్యాపింగ్ ఇది. క్లండెస్టైన్ రికార్డర్ ఉపయోగించి సంభాషణలను రికార్డు చేస్తారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు డిజి టల్ ఫోరెన్సిక్స్ కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సాధనాలను ఉపయోగించి ఈ ట్యాపింగ్ చేస్తాయి.
ల్యాప్‌టాప్ సైజు పరికరంతోనే:
అక్రమంగా ట్యాపింగ్ చేసేవాళ్లకు పెద్దగా ఎక్విప్‌మెంట్ కూడా అక్కర్లేదు. ఓ ల్యాప్ టాప్ సైజులో ఉండే సెల్యులర్ ఇంటర్‌సెప్షన్ మెషీ న్‌ను కారులో పెట్టుకుంటే చాలు.. ఎవరి ఫోన్ అయినా సులభంగా ట్యాప్ చేసేయొచ్చు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన వ్యక్తి ఇల్లు లేదా ఆఫీసు వద్ద కారు పార్క్ చేసుకుంటే చాలు అవతలి వ్యక్తి సంభాషణలన్నీ వినొచ్చు.. రికార్డు చేయొచ్చు. ఇందుకోసం ముందుగా ఆ వ్యక్తి ఫోన్ నంబర్‌ను మెషీన్‌లో ఫీడ్ చేయాలి. అనంతరం ఆ వ్యక్తికి ఫోన్ వస్తే.. ఆటోమేటిగ్గా మెషీన్‌లో రికార్డు అయిపో తుంది. సదరు వ్యక్తి గొంతును రికార్డు చేసి మెషీన్‌లో ఫీడ్ చేసినా సరే.. దాని ఆధారంగా ఆ కాల్‌ను మెషీన్ రికార్డు చేస్తుంది.
ఇజ్రాయెల్ పేరే ఎందుకు...?
ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలు తెరపైకి వచ్చిన ప్పుడు ఇజ్రాయెల్ పేరే వినిపిస్తుంది. అధునాతన సాంకేతిక రంగానికి ఇజ్రాయెల్ ప్రసిద్ధి చెందడమే ఇందుకు కారణం. ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీతో సహా నిఘా, గూఢచార సేకరణ పరికరాలను అభివృద్ధి చేసే నైపుణ్యం ఇజ్రాయెల్ సొంతం. ఇటీవల మన దేశంలో సహా పలు దేశాల్లో సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ రూపొందించింది ఇజ్రాయెలే కావడం గమనార్హం.
ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికి ఉంది...?
జాతీయ స్థాయిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అనాలసిస్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో పాటు రాష్ట్ర పోలీసు విభాగాలు నిబంధనలకు అనుగు ణంగా ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ చేయొచ్చు.
సెల్యులర్ ఇంటర్‌సెప్టర్ ఎలా పనిచేస్తుందంటే...?
ఇది చాలా సులభమైన ట్యాపింగ్ ప్రక్రియ. కాకపోతే ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. చిన్న సూట్ ్డకేసులో ఇమిడిపోయే ఈ పరికరంతో.. నిర్దేశిత వ్యక్తుల ఫోన్లను భౌతికంగా ముట్టు కోకుండా.. ఎలాంటి స్పైవేర్లూ చొప్పించకుండా ట్యాపింగ్ చేయొచ్చు. సాధారణంగా మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు మన సెల్ ఫోన్ నుంచి సిగ్నల్స్ సమీపంలోని టవర్ ద్వారా నిర్దేశిత మార్గంలో అవతలి వ్యక్తికి చేరతాయి. ఈ ప్రక్రియలో సెల్ టవర్ల నుంచి ప్రసారమయ్యే సిగ్నల్స్‌ను నేరుగా ఈ మెషీన్లు సంగ్రహించి ఆ సంభాషణలు వినేలా, రికార్డు చేసేలా పనిచేస్తాయి.
ఈ మెషీన్లలో కూడా చాలా రకాలున్నాయి.200 మీటర్ల పరిధి నుంచి దాదాపు 20 కిలోమీ టర్ల పరిధిలోని సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ఇవి సంగ్రహించగలవు. కొన్ని మెషీన్లు సెల్‌ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్స్‌ను టవర్‌కు వెళ్లకుండా ముందుగానే సంగ్రహిస్తాయి. అలాగే సామార్థ్యాన్ని బట్టి పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలో కాల్స్ వరకు ఒకేసారి ఈ మెషీన్లు రికా ర్డు చేయగలవు. కాల్స్, ఎస్సెమ్మెస్‌లే కాకుండా సోషల్ మీడియాతోపాటు మన సెల్ డివైస్ లోని సమస్త సమాచారాన్ని యాక్సెస్ చేసే ఇంటర్‌సెప్టర్లు ఉన్నాయి. వాస్తవా నికి వీటిని కొనాలన్నా చాలా అనుమ తుల తతంగం ఉంటుంది. అయితే, ఇజ్రాయెల్, సింగ పూర్ తదితర దేశాల నుంచి వీటిని అక్రమ పద్ధతిలో సమ కూర్చుకుంటున్నారు.
0 Comments