Ads Area

వయసు కొంచెం, ప్రతిభ ఘనం...!

0

 వయసు కొంచెం, ప్రతిభ ఘనం...!



హాయ్ నేస్తాలు..! స్కూల్కి సెలవులు ఉన్నా లేకపోయినా.. ఉదయాన్నే నిద్ర లేవడానికి చాలా బద్దకిస్తాం. స్కూల్ ఉంటే.. గబగబా తయారయ్యి వెళ్లిపోతాం. లేకపోతే.. అంతే తొందరగా ఆడుకోవడానికి వెళ్తాం.. కానీ ఆ సమయంలో యోగా చేయమంటే అస్సలు చేయం.. ఆ ఆలోచన కూడా రానివ్వం. అమ్మానాన్నలు బలవంతంగా చేయించినా.. ఎలా తప్పించుకోవాలా అని చూస్తాం. ఇంతకీ ఇదంతా ఎందుకూ అనుకుంటున్నారు కదూ.. ఓ చిన్నారి యోగాలో సాధించిన ఘనత గురించి తెలియజేద్దామని! దాని కోసం వెంటనే ఈ కథనం చదివేయండి మరి!

దిల్లీకి చెందిన వన్య శర్మకి ఆరు సంవత్సరాలు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతోంది. ఈ చిన్నారి అతి తక్కువ వయసులోనే యోగా చేయడం ప్రారంభించిందట. చిన్నప్పటి నుంచి తను ఉదయాన్నే లేవగానే ముందుగా యోగా చేస్తుందట. అలా తన ప్రతిభతో వివిధ విభాగాల్లో రికార్డులు సాధిస్తోంది. 'పిట్టకొంచెం కూత ఘనం' అన్నట్లు..వన్య ఇంత చిన్న వయసులోనే అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. కదూ!

శిక్షణ కూడా..!

మన వన్య చాలా రకాల యోగాసనాలు వేస్తుందట. తను చేయడమే కాకుండా.. ప్రస్తుతం ఆన్లైన్లో, ఆన్లైన్లో శిక్షణ కూడా ఇస్తుందట. మీకో విషయం తెలుసా.. అతి చిన్న వయసులో యోగా ట్రైనర్ సర్టిఫికేట్ అందుకున్న చిన్నారిగా.. పేరు దక్కించుకుంది. ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు కూడా పొందింది. తన ప్రతిభను గుర్తించిన 'ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్' వారు 'సూపర్ టాలెంటెడ్ కిడ్' అవార్డుతో సత్కరించారు. యోగాతో పాటుగా తనకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమట. ఉదయాన్నే యోగా, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే.. పుస్తకాలు చదవడం చేస్తుందట. ఎంతైనా మన వన్య చాలా గ్రేట్ కదూ! మరి మనమూ యోగా చేయడం, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుందామా!

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area