GET MORE DETAILS

మండే ఎండ - జాగ్రత్తలే అండ

 మండే ఎండ - జాగ్రత్తలే అండ



• 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు 

• వడదెబ్బ తగిలే అవకాశం 

• నీరు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలంటున్న వైద్యులు

ఎండలు ముదురుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎండాకాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఇవి జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వేసవిలో ఎదురయ్యే సమస్య లు, వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు పలు సల హాలు, సూచనలు చేశారు.

వడదెబ్బ తగిలితే...

వడదెబ్బ తగిలిన వ్యక్తిని నీడ ప్రదేశంలోకి తరలించాలి. దుస్తులను వదులు చేయాలి. తడి గుడ్డతో శరీరాన్ని తుడిచి, గాలి తగిలేలా చూడాలి. ఓఆర్ఎస్, ఉప్పు కలిపిన నీటిని తాగించాలి.

ఈ జాగ్రత్తలు పాటించాలి...

• పొగ, మద్యం తాగకూడదు. నాన్వెజ్, పచ్చళ్లు తదితర ఘాటైన పదార్థాలకు దూరంగా ఉం డాలి.

• విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి.

• ఎండలో ఉండాల్సి వస్తే సన్ స్క్రీన్ లోషన్ రాసు కోవాలి.

• వేసవిలో శరీరం చెమట రూపంలో నీరు, లవ ణాలు నష్టపోతుంది. రోజుకు 8 గ్లాసుల నీరు తాగాలి.

• చిన్నారులను ఎండలో ఎక్కువగా తిప్పొద్దు.

• ఉదయం 11 గంటల్లోపు, సాయంత్రం 4 గం టల తర్వాతేన ఇళ్ల నుంచి బయటకు రావాలి.

• కాటన్ వస్త్రాలు ధరించాలి. టోపీ, సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి.

• చర్మంపై కురుపులు, దద్దుర్లు కనిపిస్తే చర్మవ్యా ధుల నిపుణులను సంప్రదించాలి.

• ముక్కు నుంచి రక్తం వస్తే కాటన్ ప్లగ్స్ పెట్టు కొని, వైద్యున్ని సంప్రదించాలి.

• చెవుల్లో వ్యాక్సు తొలగించుకోవాలి. చెవుల్లో నుంచి చీము వచ్చే పరిస్థితి ఉన్నవాళ్లు స్విమ్మిం గ్ కు దూరంగా ఉండాలి.

• వేసవిలో ఎదురయ్యే మరో సమస్య గొంతు ఇన్ ఫెక్షన్. బయటకు వెళ్లేటప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ వెంట ఉంచుకోవాలి. మరీ చల్లని నీరు, జ్యూస్ మంచివి కావు. జ్యూస్ తాగాలినిపిస్తే ఐస్ లేకుండా తీసుకోవాలి. 

• ఎండవేడికి కళ్లలో తేమ తగ్గకుండా మూడు, నాలుగు గంటలకోసారి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

• కళ్లు మండుతుంటే కీరదోస లేదా బంగాళదుంపను గుడ్రంలా కోసి, కళ్లపై ఉంచాలి.

Post a Comment

0 Comments