GET MORE DETAILS

ఎన్నికలలో సిరా చుక్కకూ ఓ లెక్కుంది!

ఎన్నికలలో సిరా చుక్కకూ ఓ లెక్కుంది!ఎన్నికల నగారా మోగింది... అన్ని పార్టీల అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి అయ్యింది. అభ్య ర్ధుల నామినేషన్లు, ఉపసంహరణల అనంతరం బరిలో నిలి చేది ఎవరో తెలుస్తుంది.అప్పటి నుండి హెఠారెత్తించే ప్రచారాలు ఆపై ఎన్నికలు... ఇది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికల రోజున ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఎడమచేతి చూపుడువేలుపై ఒక సిరాచుక్క పెట్టడం కూడా అందరూ గమనించే ఉంటారు.

ఎందుకు ఈ సిరాచుక్క పెడుతున్నారు ?

ఎప్పటి నుంచి పెడుతున్నారని తెలుసుకోవాలంటే దానికో లెక్కుంది. ఆ లెక్కేంటో, దాని కథాకమామిషు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోలింగ్ తేదీన ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్ లోపల ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఎడమచేతి చూపుడు వేలుపై ఒక సిరా చుక్కను పెడతారు. ఈ చుక్క 72 గంటల వరకు(3రోజులు) చెరిగిపోకుండా ఉంటుంది. అంటే ఒకసారి ఓటు వేసిన వ్యక్తి మరలా ఓటు వేయకుండా ఉండాలని,దొంగ ఓట్లను నివారించే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఎప్పటినుండి సిరా చుక్క పెడుతున్నారు ?

మనదేశంలో 1962 నుండి ఈ సిరాచుక్కను పెడుతున్నారు. అయితే ఈ సిరా చుక్క ఎక్కడ తయారవుతుందో తెలుసు కుందాం. దీన్ని కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ తయారుచేస్తుంది. 1962లో కేంద్ర ప్రభుత్వం సిరా ఉత్పత్తి కోసం ఆర్డర్ ఇచ్చింది. ఈ ఫ్యాక్టరీని 4వ మైసూర్ కృష్ణ వడయార్ మహారాజు 1937లో స్థాపించారు. ఇక్కడ తయారైన సిరా దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఈ సిరా లో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉండటం వల్ల వేసిన వెంటనే చెరిగిపోకుండా 72 గంటల పాటు వేలుపై మరియు గోరుపై ఉండిపోతుంది.

హైదరాబాద్ లోనూ తయారీ:

ఈ సిరాకు ఉన్న డిమాండక్కు బట్టి కర్ణాటకతో పాటు హైదరా బాదులో కూడా ఈ సిరా తయారు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. హైదరాబాదులో "రాయుడు" ప్రయో గశాలలో సిరాను తయారు చేస్తున్నారు. ఇదే సిరాను చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసినప్పుడు కూడా ఉపయో గిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుమారు 26 లక్షల సిరా సీసాలను గత 60 ఏళ్లుగా ఒకే కంపెనీ, ప్రభుత్వానికి సరఫరా చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్డర్ ప్రకారం 2024 మార్చి నెలాఖరుకు 60శాతం సిరాను తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి కంపెనీ పంపించింది. మిగిలిన సిరా సీసాలను త్వరలో పంపుతామని మైసూర్ కంపెనీ తెలిపింది. దేశంలో ఉన్న 1.2 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఈ సిరాను చుక్క పెట్టేందుకు వాడుతారు. ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కి కి చెందిన, నేషనల్ నేషనల్ ఫిజికల్ ఫిజికల్ లాబొ లాబొరేటరీస్ ఈ సిరాను అభివృద్ధి చేసింది.

ఇతర దేశాలకూ ఎగుమతి:

మన దేశంలో తయారయ్యే ఇంకుకు చాలా గిరాకీ ఉంది. మనదేశంలో జరిగే ఎన్నికలకు మాత్రమే కాకుండా 1976 నుండి 29 దేశాలకు భారతదేశం నుండి ఈ సిరా సీసాలు ఎగుమతి అవుతున్నాయి. ఇండోనేషియా, లెబనాన్, అల్జీరి యా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, ఈజిప్ట్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

సిరా గుర్తుకు ఎన్నికల నిబంధనలు:

ఎన్నికల సంఘ నిబంధనలు సెక్షన్ 37 (1) ప్రకారము ఓటరు ఎడమ చేతిపై చూపుడు వేలుపై సిరా చుక్క వెయ్యాలి. 2006 ఫిబ్రవరి నుండి వేలుతో పాటు గోరుపై భాగంలో కూడా సిరా చుక్క వేస్తున్నారు.

ఒక సీసా ఎంతమందికి...?

10 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగిన ఒక సిరా సీసా (వైల్ 700 మందికి చుక్కలు పెట్టేందుకు ఉపయోగపడుతుంది. గతంలో గాజు సీసాల్లో సరఫరా చేసిన కంపెనీలు ప్రస్తుతం ప్లాస్టిక్ సీసాలలో సిరాను సరఫరా చేస్తున్నాయి. ఒకవేళ ఓటరుకు ఎడ మ చేయి లేకపోయినా, ప్రమాదంలో కోల్పోయినా, అప్పుడు మాత్రమే అధికారుల అనుమతితో క ఎడి చేతికి పెట్టాలనే నిబంధన కూడా ఉంది.

Post a Comment

0 Comments