GET MORE DETAILS

పదే పదే వచ్చే తలపోటుకు పరిష్కారాలివిగో...!

 పదే పదే వచ్చే తలపోటుకు పరిష్కారాలివిగో...!



సమూహంగా వచ్చే వరస తలనొప్పులను క్లస్టర్ తల నొప్పులంటారు. చికిత్సకు ఒక పట్టాన లొంగకుండా ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి వైద్యశాస్త్రపరంగా వీటికి ప్రాధాన్యత పెరిగింది. ఆయుర్వేదంలో వివరించిన అర్ధావభేదం, అన్యవాతం అనే వ్యాధుల వర్ణన క్లస్టర్ తలనొప్పితో సరిపోతుంది. అర్ధావభేదంలో తలలో సగభాగం పోటుగా ఉంటే, అనన్తవాతంలో ముక్కు, కన్ను, కనుబొమ్మలు, కణతల్లో నొప్పి వ్యాపిస్తుంది.

లక్షణాలు:

తలనొప్పి ముందుగా ఉండీలేనట్లు మొదలవుతుంది. కంటి వెనుకనుంచీ నొప్పి మొదలై పదిపదిహేను నిమిషాల్లోనే తీవ్రస్థాయికి చేరుకుంటుంది, దంతాలు, నుదురు, కణతలు, దవడల్లోకి నొప్పి ప్రసరిస్తుంది. ఒకటి రెండు గంటలపాటు కొనసాగి నెమ్మదిస్తుంది. ఇలా రోజుకు రెండు, మూడు సార్లు వస్తుంది. ఇదే తంతు కొన్ని నెలలపాటు కొనసాగుతుంది. తల నొప్పి రోజూ ఒకే సమయాల్లో వస్తూ ఉంటుంది. అంతేకాకుండా, ఏ పక్క మొదలయ్యిందో అదే పక్క మళ్లీ మళ్లీ వస్తుంటుంది. వెల్లకిలా పడుకుంటే నొప్పి ఎక్కువవుతుంది. ఈ లక్షణాలన్నీ అరేడు నెలలపాటు నిరంతరంగా కొనసాగి వాటంతట అవే తగ్గిపోతాయి. ఏడెనిమిది నెలల తరువాత మళ్లీ లక్షణాలు మెదలవుతాయి. ఇదొక నిరంతర ప్రహసనంగా మారుతుంది. క్లస్టర్ తలనొప్పిలో కేవలం తలనొప్పే కాకుండా ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, కన్ను మెరమెరలాడటం, కను రెప్ప వాలిపోవడం, కాంతిని తట్టుకోలేకపోవడం, కణతల్లోని రక్తనాళం ఉబ్బటం, కంటి పాప చిన్నదవ్వటం, వాంతులవ్వటం, శబ్దాన్ని తట్టుకోలేకపోవటం వంటి అనుబంధ లక్షణాలు కూడా ఉంటాయి. నిజానికి ఈ అనుబంధలక్షణాలే ఎక్కువ ఇబ్బందిని కలుగచేస్తుంటాయి. ఈ రకం తలనొప్పి పురుషుల్లో ఎక్కువ, కీలకబాధ్యతలు నిర్వహించే స్త్రీలలో కూడా ఎక్కువే. సాధారణంగా 20 సంవత్సరాల లోపు మొదలై జీవితాంతం కొనసాగుతుంది. పదిసంవత్సరాల లోపు పిల్లల్లో కనిపించడం. అరుదు. మైగ్రేన్ తలనొప్పికీ, క్లస్టర్ తలనొప్పికీ కొంత సారూప్యత కనిపించినప్పటికీ, నొప్పి కొనసాగే తీరులో రెంటికి తేడా ఉంది. మైగ్రేన్లో వరస తలనొప్పులుండవు.

కారణాలు:

క్లస్టర్ తలనొప్పికి ఫలానా కారణం అంటూ ఏదీ నిరూపితం కాకపోయినప్పటికీ, అనేక రకాల అంశాలు మాత్రం దీనికి దోహదపడుతుంటాయని తేలింది. ఉదాహరణకు తల లోపలి: రక్తనాళాలు వ్యాకోచం చెంది నరాల మీద ఒత్తిడిని కలుగచేయడం, జీవగడియార క్రమంలో మార్పులు సంభవించడం (థైరాయిడ్ సంబంధ సమస్యలు), నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలుత్పన్నం కావడం (ట్రైజెమైనల్ న్యూరాల్జియా), ప్రాణవాయువు సరిపోకపోవడం... ఇత్యాదివి.

Post a Comment

0 Comments