GET MORE DETAILS

విటమిన్ల లోపంతో జ్వరాలు ?

 విటమిన్ల లోపంతో జ్వరాలు ?శరీరానికి విటమిన్లు ఎంతో అవసరం. వీటివల్ల జ్వరం డైరక్ట్గా కాకుండా ఇన్ డైరక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. దీన్నే న్యూట్రిషనల్ ఫీవర్స్ అని కూడా అంటారు. ముఖ్యంగా ఎ.బి.డి. విటమిన్ల లోపం వల్ల న్యూరాలాజికల్ ఫంక్షన్స్ తేడా రావడంతో శరీరానికి, శరీరంలోని కణజాలానికి ఆక్సిజన్ సరఫరా సరిగా ఉండదు. దీంతో ఎండోక్రైన్ మెటాబాలిజమ్ ఎఫెక్ట్ వల్ల శరీర ఉష్ణోగ్రతలో కొద్దిగా తేడా వస్తుంది. వీరిలో ఎటువంటి కారణం లేకుండా జ్వరం (యుఎని జ్వరం) వస్తుంది. 

బోస్టన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్ మైకెల్ హాలిక్ ఎం.డి. 20-60శాతం మందిలో లోగ్రేడ్ ఫీవర్ (38.5సి) తరచుగా వస్తుందని తెలిపారు. ఇవి 18-45 సంవత్సరాల వారిలో ఎక్కువగా కన్పిస్తుంది. విఐటి బి12 (కోబలమిన్) లోపం వల్ల హైపర్ హీమోసీటోమియా హైపోఫాస్పేటేమియా ఏర్పడుతుంది. ఇది రక్తకణాలపై ముఖ్యంగా ఎర్రరక్తకణాలు, డిఎన్ఎపై ప్రభా వం చూపుతుంది. రక్తహీనత గల రోగుల్లో ఇది తరచుగా కన్పిస్తుంది. 70-100శాతం ఇండియాలో అర్బన్, రూరల్ ఏరియాలో సబ్ క్లినికల్గా శరీరం వెచ్చబడడం (జ్వరం) వుంటుంది. దీనివల్ల వారిలో రోగనిరోధక శక్తి తగ్గు తుం ది. ఇన్ఫెక్షన్స్, జుట్టురాలడం వుంటుంది. ఇది మామూ లు జలుబు నుండి కేన్సర్ వ్యాధుల వరకు ఉంటుంది.

కారణాలు: ఆహారపుటలవాట్లు, అపరిశుభ్రత, విటమిన్ల లోపాన్ని గుర్తించలేక పోవడం, విఐటి డి3, కడుపులో పురుగులుండడం, వైద్య సదుపాయాలు లేకపోవడం గాయాలు, విటమిన్ల ఆవశ్యకతని గుర్తించలేకపోవడం, అవగాహన లేకపోవడం ప్రధాన కారణాలు. విటమిన్ల ఓవర్ డోస్ కూడా. దీనికి ప్రధాన లోపం. ఇది ట్రోపికల్ ఏరియాలో ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా బి12, డి విటమిన్ల లోపం వల్ల వచ్చే వ్యాధి 

లక్షణాలు: లోగ్రేడ్ ఇంటర్ మిటెంట్ ఫీవర్, నీరసం, అలసట, ఆకలి లేకపోవడం దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది, కడుపునొప్పి, తలనొప్పి, తల తిరగడం, వికారం, బాడీపెయిన్స్, వాంతులు, విరేచనాలు, మలబ్దకం, నడపడానికి ఇబ్బంది ఏర్పడడం, కడుపులో గ్యాస్ ఏర్పడడం, నాలుక నునుపుగా ఉండడం, గుండె దడ, శరీరం పాలిపోయినట్లుండడం, శరీరం తేలిపోయినట్టుండడం, చూపులో తేడా, కండరాల నొప్పులు, జుట్టురాలడం, నడుంనొప్పి, గాయాలు నయం కాకపోవడం, ఎముక నొప్పులు, పెదవిపై పొక్కులు రావడం వుంటుంది. నరాల తిమ్మిర్లు, మొద్దుబారడం వుంటుంది. డైరక్ట్గా బి12 వల్ల అరుదుగా జ్వరం వస్తుంది. మొగలో బ్లాస్టిక్ అనేమియాలో సిస్టమిక్ పైరెక్సియా వస్తుంది.

ఇది ఆటో ఇమ్మ్యూన్ వ్యాధుల్లో, కాన్సర్స్ వ్యాధుల్లో, డెంగ్యూ, మలేరియా, బోస్మారో వ్యాధులు, బాక్టీరి యల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ డయాబెటిస్ ఉన్నప్పుడు కల్గుతుంది. విటమిన్ డి లోపంవల్ల వచ్చే వ్యాధిలక్షణాల నీరసం, మగత, కండరాల నొప్పులు, ఎముక నొప్పులు, బి.పి. ఎక్కువ కావడం, శరీరంలో వేడి ఆవిర్లు రావడం, తలలో అధిక చెమటలు, ముఖం, ఛాతీ, మెడభాగంలో ఎక్కువగా కన్పిస్తాయి. జాయింట్పెయిన్స్ డిప్రెషన్, చిరాకు, ఆస్టియో మలేరియా, ఎముకల సాంద్రత తగ్గడం అస్టియోపారోసిస్, ఎముకలు విరగడం ఉంటుంది. దీర్ఘకాలం విటమిన్ల లోపం వున్నప్పుడు ఇతర వ్యాధులవల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ర్ప ఏర్పడతాయి. 

థైరాయిడ్ లోపాలు, ఆటోఇన్యూన్ లోపాలు, కార్డియో వాస్కులార్ డిసీజెస్, ఆటోఇమ్యూన్ వ్యాధులు, కేన్సర్, బరువు పెరగడం, ఆర్జీమర్స్ డిసీజ్, కంటి చూపులో తేడా, ఎండోక్రైన్ పనుల అస్తవ్యస్థత, డిప్రెషన్, (సెరటోనిన్ తగ్గడం) (స్కీజోఫ్రెనియా వంటి మానసిక వ్యాధులు ఏర్పడతాయి. ఎథిరోక్లీరోసిస్, ఇన్ఫ్లమేటరీ ఆక్సిడేటివ్ ఛేంజ్ ఏర్పడ తాయి. న్యూరో ట్రాన్స్ మీటర్ ఫంక్షన్స్లో తేడా విటమిన్ సి లోపం వల్ల రావడంతో శ్వాసకోశ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు కూడా వస్తాయి.

Post a Comment

0 Comments