PERFECT HEALTH : సంపూర్ణ ఆరోగ్యానికి 'పది' సూత్రాలు...!!
మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా మనసు పెట్టి చేయగలుగుతాం. మరి, అలాంటి ఆరోగ్యం మన సొంతం కావాలంటే చక్కటి పోషకాహారం తీసుకోవడమే కాదు.
వాటిని తినడానికీ ఓ పద్ధతుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అలాగే ఆహారంతో పాటు వ్యాయామానికీ సమ ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. 'జాతీయ పోషకాహార వారం' సందర్భంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే పాటించాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాల గురించి తెలుసుకుందాం రండి.. మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా మనసు పెట్టి చేయగలుగుతాం.
మరి, అలాంటి ఆరోగ్యం మన సొంతం కావాలంటే చక్కటి పోషకాహారం తీసుకోవడమే కాదు.. వాటిని తినడానికీ ఓ పద్ధతుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అలాగే ఆహారంతో పాటు వ్యాయామానికీ సమ ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. 'జాతీయ పోషకాహార వారం' సందర్భంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే పాటించాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాల గురించి తెలుసుకుందాం రండి.
"అందరికీ ఇవి అవసరం"!
చక్కటి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఈ పది సూత్రాలు తప్పక పాటించాలి.
1. తినడానికీ ఓ పద్ధతుంది.. కూర్చొనే తినాలి.. అది కూడా స్పూన్స్‌తో కాకుండా చేతులతో తినడం అలవాటు చేసుకోవాలి.
ఆహారాన్ని ఆదరాబాదరాగా మింగడం కాకుండా బాగా నమలాలి.
2. తినేటప్పుడు గ్యాడ్జెట్స్ చూడడం, ఇతర విషయాలపై పరధ్యానం తగదు.
3. రోజువారీ ఆహారంలో భాగంగా గుప్పెడు నట్స్ తీసుకోవడం మంచిది.
ఉదాహరణకు: ఉదయం పూట బాదంపప్పులు/వాల్‌నట్స్, మధ్యాహ్నం వేరుశెనగ/జీడిపప్పులు తీసుకోవచ్చు.
4. ఆయా సీజన్లలో లభించే ఆకుపచ్చ కాయగూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ వర్షాకాలంలో పొట్లకాయ, బెండకాయ, గోంగూర.. వంటివి తినాలి.
5. రాగులు, జొన్నలు కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
6. ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగునే తీసుకోండి.
7. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి Sending కచ్చితంగా టీస్పూన్ నెయ్యి తీసుకోవడం మాత్రం మరవద్దు.
8. రోజూ అరగంట వ్యాయామం మనల్ని ఆ రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
9. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, నిద్ర లేవడం కాకుండా.దానికంటూ ఒక కచ్చితమైన సమయం పెట్టుకొని రోజూ అదే ఫాలో అవ్వండి.
10. అవసరం లేకున్నా మొబైల్‌తో కాలక్షేపం చేయడం, టీవీ చూడడం.. వంటివి తగ్గించుకుంటే మంచిది.
0 Comments