GET MORE DETAILS

ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పట్టాలంటే...?

 ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పట్టాలంటే...?



 నెయ్యి మంచిదే! (GHEE BENEFITS):

• ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచా నెయ్యి, కొద్దిగా పసుపు, మిరియాలు వేసి తాగితే జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది.

• మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది.

• నెయ్యి జీవక్రియల రేటు మెరుగుపరిచేలా చేస్తుంది. ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

• ఇందులో బ్యుట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది ప్రోబయోటిక్‌ ఫుడ్‌గా పనిచేసి పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

• నెయ్యిలో విటమిన్‌ - కె2 సమృద్ధిగా లభిస్తుంది. ఎముకలు క్యాల్షియంను గ్రహించడానికి ఇది సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గేందుకు ఉపకరిస్తుంది.

• 5 గ్రాముల నెయ్యిలో 44.8 క్యాలరీలు, 4.9 గ్రా ఫ్యాట్‌ ఉంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, మినరల్స్‌, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.

• డయాబెటిస్‌, ఒబేసిటి, అధిక కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు డాక్టర్‌ సలహా మేరకు నెయ్యిని తీసుకోవాలి.

Post a Comment

0 Comments