GET MORE DETAILS

కాలేయాన్ని కాపాడుకుందాం : ఏప్రిల్ 19 ప్రపంచ కాలేయ దినోత్సవం

కాలేయాన్ని కాపాడుకుందాం : ఏప్రిల్ 19 ప్రపంచ కాలేయ దినోత్సవం


యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836


శరీరంలోనే చర్మం తరువాత కాలేయం (లివర్) అతిపెద్ద అవయవం. ఇది శరీరంలో కుడి వైపున పై భాగంలో పక్కటెముక కింద ఉంటుంది. కాలేయం సాధారణంగా 1.2 kgల నుంచి 1.5kgల వరకు బరువు ఉంటుంది. ఈ పరిమాణం వయస్సు, శరీరం, లింగం ఆధారంగా మారుతుంది. ఇది శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేసే ప్రయోగశాలగా పనిచేస్తుంది. కాలేయానికి ఏదైనా సమస్య వస్తే శరీరంలో అనేక అనారోగ్యకరమైన సమస్యలు వస్తాయి.

శరీరంలోని ఇతర భాగాలతో పోలిస్తే దెబ్బతిన్న కణాలను తిరిగి అభివృద్ధి చేసుకోగల సామర్ధ్యం ఒక్క కాలేయానికి మాత్రమే ఉంటుంది. అయితే కలుషిత నీరు, ఆహారం, రక్త మార్పిడి తదితర కారణాల వల్ల కాలేయానికి వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కాలేయం తను చేయాల్సిన పనులు చేయలేకపోతుందో అప్పుడు మనకు కొన్ని రకాల రోగ లక్షణాలు బయటపడుతాయి. కాలేయవ్యాధి వచ్చిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతిని ప్రాణాంతక వ్యాధులు సైతం దరిచేరుతాయి.

కాలేయంలోని కణాల్లో అదనంగా కొవ్వు నిల్వ చేయబడడంతో కాలేయం పనిచేయడం కష్టతరమవుతుంది దీనినే ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఈ సమస్య రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. 

అయితే కొన్ని సందర్భాలలో మద్యపానం తీసుకోకుండానే కాలేయంలో కొవ్వు పేరుకుపోయే పరిస్థితిని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు.కాలేయ సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవం జరుపుతున్నారు. మద్యం వల్ల కాలేయం దెబ్బతింటుంది.

కాలేయం పనితీరు సక్రమంగా ఉండాలంటే సమతుల్య ఆహారం మరియు తక్కువ కొవ్వు పదార్ధాలను తీసుకోవాలి.మద్యానికి దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వైద్యుల సలహా మేరకు కాలేయ పని తీరుని మెరుగుపర్చుకోవాలి.



Post a Comment

0 Comments