GET MORE DETAILS

సమ్మర్ కేర్: వేడికి విరుగుడు

 సమ్మర్ కేర్: వేడికి విరుగుడు



ఈ ఏడాది ఎండలు మునుపటికి మించి మండిపోతాయని ముందుగానే వార్తలొచ్చాయి. వాటికి తగ్గట్టే వేడి, ఉక్కపోతలు మార్చి నుంచే వేధించడం మొదలుపెట్టేశాయి. అయితే ఈ వేసవి నుంచి రక్షణ పొందాలంటే చల్లదనాన్ని అందించే జాగ్రత్తలు పాటించాలి.

వేసవి వేడితో శరీరంలోనూ వేడి పెరుగుతుంది. దాంతో అలసట, బడలిక, విపరీతమైన చమట, చర్మం పొడిబారడం, తలనొప్పి, మగత, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎండ వేడిమికి శరీర ఉష్ణోగ్రత క్రమేపీ పెరుగుతూ 104 డిగ్రీలకు చేరుకుంటే ఎండదెబ్బకు గురవుతాల అత్యధిక ఉష్ణోగ్రతలకు గురయినా లేక వేడి వాతావరణంలో శారీరక శ్రమ వల్ల శరీర ఉష్ణోగ్రత ఆ మేరకు చేరుకున్నా, ఎండదెబ్బకు గురవడం సహజం. అందుకు పలు కారణాలు ఉంటాయి. వాటిలో...

■ గాలి దారాళంగా చొరబడని దుస్తులు, చమటను పీల్చుకునే వీలు లేని దుస్తులు ధరించడం. వేడిని గ్రహించే వీలున్న నల్ల దుస్తులు ధరించడం..

■ మద్యం తీసుకోవడం మద్యం తాగడం వల్ల ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసే శక్తి శరీరం కోల్పోతుంది.

■ చమట ద్వారా శరీరం కోల్పోయిన నీటిని భర్తీ చేయకపోవడం.

నివారణ తేలికే!

ఎండదెబ్బ బారిన పడి, బాధ పడేకంటే, ఆ స్థితి రాకుండా జాగ్రత్త పడడం మేలు, వేసవి వేడి, ఎండల ప్రభావానికి గురవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.

దుస్తులు: ధరించే దుస్తులు తేలికగా, గాలి చొరబడేలా, చమట పీల్చేలా సౌకర్యంగా ఉండాలి. వీలైనంతవరకూ తెల్లని దుస్తులే ధరించాలి.

సూర్యరశ్మి: సూర్యరశ్ళి నేరుగా సోకితే, శరీరం తనంతట తాను చల్లబడే స్వభావాన్ని కోల్పోతుంది. కాబట్టి ఎండలో బయటకు వెళ్లవలసివస్తే తలకు టోసీ, కళ్లకు చలువ కళ్లద్దాలు, గొడుగు తప్పనిసరిగా వాడాలి. వైద్యులు సూచించే సన్ స్క్రీన్ వాడడం వల్ల చర్మం కమిలిపోకుండా, పొడిబారకుండా ఉంటుంది.

దాహం వేసేవరకూ ఆగకుండా గంటకొకసారి నీళ్లు తాగుతూ ఉండాలి, నీళ్లతోపాటు కొబ్బరినీరు, మజ్జిగ కూడా తరచుగా తాగుతూ ఉండాలి ఇలా ఒంట్లో నీరు, ఖనిజలవణాల పరిమాణాన్ని సక్రమంగా ఉంచుకుంటే ఎండ ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతాం

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండ తీవ్రత ఎక్కువ. కాబట్టి సమయాల్లో నీడ పట్టున గడపాలి. వ్యాయామానికి ఎండ లేని సమయాలను కేటాయించాలి.

వేసవిలో పసిపిల్లల రక్షణ!

పిల్లల లేత శరీరాలు ఎండ దెబ్బకు తేలికగా గురవుతాయి కాబట్టి ఎండాకాలంలో పిల్లలకు వేసే దుస్తుల మొదలు, అందించే ఘన, ద్రవ పదార్థాల వరకూ ప్రతి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. 

ఆరు నెలల లోపు పిల్లలకు తల్లి పాలు తప్ప విడిగా మరే ద్రవాలు ఇవ్వవలసిన అవసరం లేదు. పాల ద్వారానే వాళ్ల దాహార్తి తీరుతుంది. తల్లి పాలతో వేసవి వేడిమిని తట్టుకునే శక్తి దొరుకుతుంది. 

పసికందులు రోజుకి ఆరు నుంచి ఏడుసార్లు మూత్ర విసర్జన చేస్తుంటే వాళ్ల దాహార్తి తీరుతోందని అర్ధం చేసుకోవాలి. అంతకంటే తక్కువ సార్లు చేస్తే తల్లి పాలు సరిపోవట్లేదని గ్రహించి పోత పాలు మొదలుపెట్టాలి.

■ పిల్లల మూత్రం నీరులా స్వచ్చంగా ఉందంటే వాళ్లకు సరిపడా నీరు అందుతోందని గ్రహించాలి.

■ఆరు నెలలు దాటి ఘనాహారం మొదలు పెట్టిన పిల్లలకు కొబ్బరి నీరు, చక్కెర కలపని తాజా పళ్ల రసాలు తాగించవచ్చు.

■ పిల్లలకు ఘనాహారంగా బియ్యం నూర, గోధుమలు, రాగులను వేయించి పొడి చేసి డబ్బాల్లో పోసి పెట్టుకుని వాడుకోవాలి.

■పొడికి నీళ్లు చేర్చి మెత్తగా ఉడికించి పప్పు, కూరలతో తినిపించవచ్చు.

■ ఘనాహారంతోపాటు తాజా పళ్లు చిన్న ముక్కలుగా కోసి లేదా గుజ్జు చేసి తినిపించాలి. ■ఆహారం తినిపించే ముందు, తినిపించిన వెంటనే స్నానం చేయించకూడదు.

Post a Comment

0 Comments