భారతరత్న డాక్టర్ B.R.అంబెడ్కర్ గారి 133 వ జయంతి శుభాకాంక్షలు.
2024 : ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బీమ్ రావ్ అంబేడ్కర్ జయంతి (Ambedkar Jayanti) వేడుకలు నిర్వహిస్తారు. డా. బీ. ఆర్ అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో జన్మించారు.దళిత వర్గానికి చెందిన ఆయన తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు.దళితుడైన కారణంగా అంబేడ్కర్ను అంటరానివాడిగా చూసేవారు. స్కూల్కు వెళ్లినా వేర్వేరుగా కూర్చోవల్సిన పరిస్థితి. ఒక్కోసారి క్లాస్రూమ్లోనే కూర్చోనిచ్చేవారు కాదు.ఇన్ని కష్టాల మధ్య అంచెలంచెలుగా ఎదిగిన అంబేడ్కర్..ఒక గొప్ప ఎకనామిస్ట్గా,జ్యూరిస్ట్గా, సామాజిక కార్యకర్తగా,రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి నాయకత్వం వహించిన ఘనత అంబేడ్కర్ సొంతం. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం.
అంబేడ్కర్ కు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు:
బాబాసాహెబ్ అంబేడ్కర్ తన తల్లిదండ్రులకు 14వ సంతానం. ఆయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేడ్కర్. బీ. ఆర్ అంబేడ్కర్ అసలు ఇంటి పేరు అంబావాడేకర్. ఆ పేరును అంబేడ్కర్గా మార్చారు ఆయన టీచర్ మహదేవ్ అంబేడ్కర్. ఇక.. త్రివర్ణ పతాకాన్ని రూపొందించింది పింగళి వెంకయ్య అన్న విషయం తెలిసిందే.అయితే.. జెండాలోకి అశోక చక్ర.. బీ.ఆర్ అంబేడ్కర్ వల్లే వచ్చిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.నోబెల్ బహుమతి పొందిన ప్రొఫెసర్ అమర్త్య సేన్.. అంబేడ్కర్ను 'ఫాథర్ ఆఫ్ ఎకనామిక్స్'గా సంబోధించారు.
అంబేద్కర్ కు 64 సబ్జెక్ట్లలో మాస్టర్స్ డిగ్రీ ఉంది.
హిందీ, పాలీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ వంటి భాషల్లో ఆయను ప్రావీణ్యం ఉంది.వీటితో పాటు దాదాపు 21ఏళ్ల పాటు.. ప్రపంచంలోని అన్ని మతాల గురించి చదివారు.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో 8ఏళ్ల కోర్సును కేవలం 2ఏళ్ల 3 నెలల్లో పూర్తి చేశారు.ఇందుకోసం ఆయన రోజుకు 21 గంటలు చదువుకునేవారు.
*బాబాసాహెబ్ అంబేడ్కర్ను 'ఈ తరం బుద్ధుడు' అని పిలిచేవారు బౌద్ధ సన్యాసి మహంత్ వీర్ చంద్రమణి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి "డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెన్స్" పీహెచ్డీ పొందిన మొదటి, ఏకైక వ్యక్తి అంబేడ్కర్.
అంబేద్కర్ ప్రాముఖ్యతలు:
అంబేద్కర్ దేశంలోని వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక అన్యాయాలను నిరసించాడు. దళితులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన తన ప్రముఖ వ్యాసం- “నో ప్యూన్, నో వాటర్”లో ఎత్తిచూపారు.అంబేద్కర్‌కు తాగునీరు నిరాకరించిన సందర్భాన్ని ఎస్సై గుర్తు చేసుకున్నారు.దళిత హక్కుల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం మార్చి 31,1995న అట్రాసిటీ నిరోధక (POA) చట్టాన్ని రూపొందించింది.
అంబేద్కర్ 1947 ఆగస్టు 29 నుండి జనవరి 24,1950 వరకు భారతదేశానికి న్యాయ మంత్రిగా పనిచేసిన కాలంలో జనవరి 26, 1950 నుండి అమల్లోకి వచ్చిన దేశ రాజ్యాంగాన్ని రూపొందించినందున అంబేద్కర్ ‘భారత రాజ్యాంగ పితామహుడు’ అని కూడా పిలుస్తారు.
అంబేద్కర్ 1951లో ఫైనాన్స్ కమీషన్ ఆఫ్ ఇండియాను స్థాపించారు మరియు ఆయన నిర్దేశించిన మార్గదర్శకాలు మరియు ఆలోచనల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.
అంబేద్కర్‌కు మరణానంతరం మార్చి 31, 1990న దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రధానం చేశారు.
Ambedkar Quotes:
1. ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు.
2. సకాలంలో సరైన చర్య తీసుకుంటే.. దాని ఫలితం పది కాలాల పాటు నిలుస్తుంది.
3. నేను,నా దేశం ఈ రెండింటిలో నా దేశమే అత్యంత ముఖ్యమైనది.
4. ఏ కారణం లేకుండా నీపై విమర్శలు వస్తున్నాయంటే.. నువ్వు విజయం సాధించ బోతున్నావని అర్థం.
5. నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు.
6. జీవితంలో విలువలు నేర్చించేదే నిజమైన విద్య.
7. మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం,మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం.. రెండూ తప్పే.
8. ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు.. ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం.
0 Comments