GET MORE DETAILS

ప్రజారోగ్యానికి కల్తీ ముప్పు

 ప్రజారోగ్యానికి కల్తీ ముప్పు



దేశంలో ఆహార కల్తీ అంతకంతకు పెచ్చుమీరుతోంది. కలుషిత ఆహారం కారణంగా రోజూ ఎంతో మంది తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. పరిస్థితి చేయిదాటడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆహార నాణ్యతను పెంపొందించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి.

కల్తీ ఆహార ఉత్పత్తుల కారణంగా ప్రజారోగ్యం ప్రశ్నార్ధకంగా మారు తోంది. హైదరాబాద్లో ఇటీవల పలు ప్రాంతాల్లో రసాయనాలతో మగ్గబెట్టిన మామిడిపండ్లను అధికా స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవల పానీపూరి తిని ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడటం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆహార ఉత్పత్తు లపై సరైన నిఘా కొరవడటంవల్లే దేశంలో తరచూ ఇటువంటి ఘట నలు చోటుచేసుకుంటున్నాయి. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లు పాలు, టీ పొడి మొదలు పసుపు, కారం, మసాలా దినుసులు వంటి వంట సరకులన్నీ కల్తీ అవుతున్నాయి. ఆహార కల్తీ నిరోధక చట్టం-1954 కఠిన శిక్షలు నిర్దేశించినా, అవి ఎక్కడా సరిగ్గా అమలు కావడంలేదు.

హానికర రసాయనాలు...

ప్రజలందరికీ పరిశుభ్రమైన ఆహారం అందేలా చూడటం ప్రభు త్వాల కనీస బాధ్యత. ఆధునిక కాలంలో ప్రజల జీవనశైలి, ఆహార అలవాట్లు మారుతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరుగుతుండ టంతో దుకాణదారుల మధ్య పోటీ తీవ్రమవుతోంది. దాంతో కొందరు కల్తీకి పాల్పడుతూ తక్కువ ధరకే సరకులను విక్రయిస్తు న్నారు. మరోవైపు, సిద్ధం చేసిన ఆహారంవైపు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. వారిని ఆకర్షించడం కోసం చాలామంది దుకాణదా రులు తినుబండారాలు, ఆహార పదార్థాల తయారీలో రుచి, రంగు కోసం హానికరమైన రసాయనాలు, రంగులను ఉపయోగిస్తున్నారు.. ఇటువంటి కల్తీ కారణంగా దేశంలో సుమారు 10కోట్ల మంది రక రకాల వ్యాధులతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2030 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు కలుషిత ఆహారం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ కారణంగానే ఏటా సుమారు 4,20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆహార కల్తీకి ఎక్కువగా అయిదేళ్లలోపు చిన్నారులే ప్రభావితం అవుతుం డటం తీవ్ర ఆందోళనకరం. కలుషిత, కల్తీ ఆహారం వల్ల అతిసారం నుంచి క్యాన్సర్ల వరకు దాదాపు 200 రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆహార పదార్థాల నాణ్యత తీసికట్టుగా ఉంటోందని భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ ఎస్ఎస్ఏఐ) నివేదిక 2022-23 హెచ్చరించింది. ముఖ్యంగా ఆహార నమూనాల సేకరణ, పరీక్షలకు అవసరమైన మౌలిక వసతులు ఆంధ్ర ప్రదేశ్లో ఏమాత్రం బాగాలేవని అది పేర్కొంది. ఈ అంశానికి 17 మార్కులను గరిష్ట స్కోరుగా నిర్ణయిస్తే, ఏపీ కేవలం ఒక్క మార్కునే సాధించింది! 2022-23 కు సంబంధించి మొత్తం ఆరు విభాగాల్లో మెరుగైన పనితీరును కనబరచి కేరళ అత్యధికంగా 63 మార్కు లను సాధించింది. ఆ తరవాతి స్థానాల్లో పంజాబ్ (57.5), తమిళ నాడు (56.5) నిలిచాయి. ఏపీ, తెలం గాణలు మాత్రం వరసగా 24, 32 మార్కులకే పరిమితమయ్యాయి. దేశంలోని అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. 2000-22 మధ్య కాలంలో ఇటువంటి ఘటనలు అత్యధికంగా కర్ణాటక(1,524), ఒడిశా(1,327), తెలంగాణ(1,092), బిహార్ (950), ఏపీ(794) రాష్ట్రాల్లో నమోదయ్యాయి. సరైన మౌలిక వసతులు, తనిఖీలు లేకపోవడం వల్లే మధ్యాహ్న భోజన పథకం అమలు లోపభూయిష్టంగా ఉంటోం దని 'కాగ్' గతంలోనే హెచ్చరించింది. దేశంలో ఆహార ఉత్పత్తుల విక్రయ కేంద్రాల రిజిస్ట్రేషన్, అనుమతుల మంజూరు, తనిఖీలు, నమూనాల సేకరణ ప్రక్రియలు తూతూమంత్రంగానే సాగుతు న్నాయి. ఆహార నాణ్యతకు సంబంధించి బాధితులు టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేసినప్పటికీ, సంబంధిత యంత్రాంగం సరిగ్గా స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆహార తనిఖీ సిబ్బంది అరకొరగా ఉండటంవల్ల తనిఖీలు మొక్కుబడిగా సాగుతున్నాయని చెబుతున్నారు. ఏపీలో ఆహార పరీక్ష కేంద్రం (ఫుడ్ లేబొరేటరీ) ఏర్పాటు పనులు ఇంకా పూర్తికాలేదు. దాంతో ఆహార నమూనాలను హైదరాబాద్కు పంపాల్సి వస్తోంది.

కఠిన చర్యలతోనే...

దేశ ప్రజలకు సురక్షితమైన ఆహారం అందినప్పుడే ఉత్పాదకత పెరుగుతుంది. ప్రజలపైనా, ప్రభుత్వాలపైనా వైద్య ఖర్చుల భారం తగ్గుతుంది. కాబట్టి ఆహార నాణ్యతను తనిఖీ చేసే సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలి. ఆహార నాణ్యతను నిర్ధారించడానికి అవస రమైన పరీక్ష కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలి. ఆహార కల్తీకి సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించి, కల్తీరాయుళ్లకు కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించాలి. అప్పుడే దేశంలో ఆహార కల్తీకి అడ్డుకట్ట పడుతుంది. ప్రజారోగ్యానికి భరోసా దక్కుతుంది అత్యధికంగా 63 మార్కు లను సాధించింది. ఆ తరవాతి స్థానాల్లో పంజాబ్ (57.5), తమిళ నాడు (56.5) నిలిచాయి. ఏపీ, తెలం గాణలు మాత్రం వరసగా 24, 32 మార్కులకే పరిమితమయ్యాయి. దేశంలోని అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. 2000-22 మధ్య కాలంలో ఇటువంటి ఘటనలు అత్యధికంగా కర్ణాటక(1,524), ఒడిశా(1,327), తెలంగాణ(1,092), బిహార్ (950), ఏపీ(794) రాష్ట్రాల్లో నమోదయ్యాయి. సరైన మౌలిక వసతులు, తనిఖీలు లేకపోవడం వల్లే మధ్యాహ్న భోజన పథకం అమలు లోపభూయిష్టంగా ఉంటోం దని 'కాగ్' గతంలోనే హెచ్చరించింది. దేశంలో ఆహార ఉత్పత్తుల విక్రయ కేంద్రాల రిజిస్ట్రేషన్, అనుమతుల మంజూరు, తనిఖీలు, నమూనాల సేకరణ ప్రక్రియలు తూతూమంత్రంగానే సాగుతు న్నాయి. ఆహార నాణ్యతకు సంబంధించి బాధితులు టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేసినప్పటికీ, సంబంధిత యంత్రాంగం సరిగ్గా స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆహార తనిఖీ సిబ్బంది అరకొరగా ఉండటంవల్ల తనిఖీలు మొక్కుబడిగా సాగుతున్నాయని చెబుతున్నారు. ఏపీలో ఆహార పరీక్ష కేంద్రం (ఫుడ్ లేబొరేటరీ) ఏర్పాటు పనులు ఇంకా పూర్తికాలేదు. దాంతో ఆహార నమూనాలను హైదరాబాద్కు పంపాల్సి వస్తోంది.

Post a Comment

0 Comments