సెల్ టవర్లు లేకున్నా మొబైల్ కమ్యూనికేషన్స్ : శాటిలైట్ల సాయంతో చైనా ముందడుగు
మొబైల్ కమ్యునికేషన్స్ వ్యవస్థలో 'శాటిలైట్’ కనెక్టివిటీని సాధించటంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు.
సెల్ టవర్లు లేకుండానే ఫోన్లలో మాట్లాడుకోవచ్చని చెప్తున్నారు. చైనా రోదసిలోకి పంపిన 'టియాన్‌టాంగ్-1' సిరీస్ ఉపగ్రహాల సంఖ్య మూడుకు చేరుకుంది. దీంతో ఆసియా-పసిఫిక్ ప్రాంతమంతా మొబైల్ శాటిలైట్ కనెక్టివిటీకి మార్గం సుగమమైంది.
ప్రపంచంలో శాటిలైట్ కనెక్టివిటీని సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చిన మొదటి కంపెనీగా హువాయి ఇప్పటికే గుర్తింపు పొందింది. తాజాగా ఈ జాబితాలో షావోమీ, హానర్, ఒప్పో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు చేరాయి. భూకంపాలు, తుఫాన్లు.. వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు 'శాటిలైట్ కనెక్టివిటీ' కీలకపాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 'మొబైల్ ఫోన్లకు డైరెక్ట్ శాటిలైట్ కనెక్టివిటీ మరింత పాపులర్ అవుతుంది' అని సైంటిస్టు కూయి వాన్‌జావో అన్నారు.
0 Comments