GET MORE DETAILS

క్షయవ్యాధి అంటే ఏమిటి? నివారణ ఎలా..?

 క్షయవ్యాధి అంటే ఏమిటి? నివారణ ఎలా..?




మార్చ్ 24 ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా...

క్షయవ్యాధినే “ట్యుబర్కులోసిస్" (టీబీ) అని అంటారు. గత 20ఏళ్లలో టీబీ కేసుల సంఖ్య చాలావరకు తగ్గింది. ప్రతి సంవత్సరం 10 కోట్ల మంది ఈ వ్యాధితో బాధవడుతున్నారు. ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం వరల్డ్ టీబీ డేని జరుపుతున్నారు. 1882 మార్చి 24 టీబీకి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నట్లు డాక్టర్ రాబర్ట్ కోచ్ ప్రకటించిన రోజును ఈ తేదీ గుర్తుచేస్తుంది. ఇది ఈ అంటు వ్యాధిని నిర్ధారించడానికి, నయం చేయడానికి మార్గం తెరిచింది. డబ్ల్యూహచి ప్రకారం, "ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతకమైన ఇన్ఫెక్షియస్ కిల్లర్లలో టీబీ ఒకటి. ప్రస్తుతం క్షయవ్యాధిని నయం చేసేందుకు అనేక రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి గతంలో భయపడాల్సినంతగా ఈ వ్యాధి గురించి ఇప్పుడు భయపడాల్సిన పనిలేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయ (టీబీ) వ్యాధి దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అవును మనం క్షయ వ్యాధిని అంతం చేయగలం అనే థీమ్ తో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికీ మన దేశంలో ప్రతి రోజూ 1400 మందికి పైగా క్షయవ్యాధి కారణంగా మరణిస్తున్నట్లు ఈ వ్యాధి ఎంత ప్రాణాంతకరమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధికి నివారణ, చికిత్స ఉన్నా... వ్యాధి గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి నిర్ధారణ, చికిత్సలో టీబీ సమూల నిర్మూలనలో ఎన్నో అవాంతరాలు ఎదరువుతున్నాయి.

క్షయ వ్యాధి 'మైకోబాక్టీరియం ట్యుబర్కులోసిస్' అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఊపిరితిత్తులు లేదా గొంతు టిబి ఉన్న రోగి దగ్గినప్పుడు లేదా మాట్లాడినప్పుడు వెలుబడే తుంపరలు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి పీల్చినప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. టీబీ వ్యాధి సాధారణంగా ఊరిపితిత్తులకు సంక్రమిస్తుంది. కొన్ని సార్లు ఈ వ్యాధి మెడ చుట్టూ ఉన్న లింఫ్ గ్రంథులకు (లింఫ్ నోడ్ టీబీ), వెన్నెముకకు (స్పైన్ టిబి), మెదడు (టిబి మెనింజైటిస్), గుండెకు, ఎముకలకు, కీళ్లకు ఇలా మన శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. గత 2 దశాబ్దాలుగా భారతదేశంలో టీబీ కేసుల సంఖ్య తగ్గుతోంది. ముఖ్యంగా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కేసులు పెరుగుతున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రక్తం, కఫం, ఎక్స్ రే. వంటి వైద్య

పరీక్షల ద్వారా క్షయవ్యాధిని నిర్ధారిస్తారు. చికిత్స విషయంలో బెడాక్విలిన్, డెలామానిడ్ వంటి డ్రగ్ రెసిస్టెంట్ టిబికి కొత్త ఔషధాలు వాడడంవల్ల చాలా మంది రోగులు ఈ వ్యాధి నుంచి తక్కువ సమయంలోనే కోలుకుంటున్నారు. కాబట్టి ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల టీబీ వచ్చిన వారికి దీర్ఘకాలికంగా దగ్గు (రెండు వారాలకు మించి), గళ్ల పడడం, జ్వరం, ఛాతీనొప్పి, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, కొన్నిసార్లు దగ్గినప్పుడు రక్తం పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉన్నవారు సరైన సమయంలో సంప్రదిస్తే, వారికి ఛాతి ఎక్స్రే లేదా సి.టి స్కాన్, గళ్ల పరీక్ష, టిబి రెసిస్టెన్స్ వంటి వివిధ పరీక్షలు నిర్వహించి ఈ వ్యాధిని గుర్తిస్తారు.

డ్రగ్ రెసిస్టెంట్ టిబి వచ్చిన వారు ద్వితీయ శ్రేణి టీబీ మందులు 9 నుంచి 24 నెలల వరకు వాడాల్సివస్తుంది. ఈ చికిత్సలో వాడే మందులకు ఒకింత దుష్ప్రభావాలు ఎక్కువ కాబట్టి, అప్పుడప్పుడు రక్త పరీక్షలు, గుండె పరీక్షలు, వినికిడి, కంటి పరీక్షలు చేయించాలి. టిబిని త్వరగా గుర్తించడం, 6 నెలల చికిత్స క్రమం తప్పకుండా వాడడం ద్వారా చాలా వరకు ప్రమాదకర డ్రగ్ రెసిస్టెంట్ టీబీ పెరగకుండా నియంత్రివచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డుపెట్టుకోవడం వంటి జాగ్రత్తల ద్వారా టిబిని కొంతమేరకు నిరోధించవచ్చు.

Post a Comment

0 Comments