GET MORE DETAILS

ఒక్క మందు ఊబకాయం, షుగర్ ఔట్! (నెలకు రూ.17,500 వరకు ఖర్చుతో...)

ఒక్క మందు ఊబకాయం, షుగర్ ఔట్! (నెలకు రూ.17,500 వరకు ఖర్చుతో...)


• ఏకకాలంలో రెండింటినీ నియంత్రించే 'మాపుంజరో' ఇంజెక్సన్ మన దేశంలో అందుబాటులోకి.

• అమెరికా ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ అభివృద్ధి చేసిన ఔషధం.

• నెలకు సగటున అయ్యే ఖర్చు రూ.17,500.

• అమెరికాలో అమ్మే ధరలో ఐదో వంతుకే ఇక్కడ విడుదల ఊబకాయం నియంత్రణ కోసం మరికొన్ని ఔషధాలు కూడా అందుబాటులో.

• తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలంటున్న నిపుణులు.

• ఎన్ని ఔషధాలు వాడినా జీవనశైలి మార్పులతో మంచి ఫలితం ఉంటుందని స్పష్టీకరణ.

భారత్లో ఏటేటా ఊబకాయుల శాతం పెరిగిపోతోంది. తద్వారా మధుమేహం బారినపడుతున్నవారూ ఎక్కువగానే ఉంటున్నారు. వేశంలో సుమారు 10 కోట్ల మంది వరకు మధుమేహ బాధితులు ఉన్నట్టు అంచనా. అది సమయంలో జనాభాలో 6.5 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వీరిలో సగం మందికిపైగా ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదని పలు అధ్యయనాలు తేల్చాయి కూడా సరైన ఔషధాలు అందుబాటులో లేకపోవడం, అవగాహన లేమి వంటివి కారణమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మన దేశం లోకి 'మంజారో (బైద్దెపటైడ్)' పేరిట స్థూలకాయాన్ని మధుమేహాన్ని నియంత్రించే ఔషధం అందుబాటులోకి వచ్చిం ది. అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఎలీ లిల్లీ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటికి అమెరికా, యూరప్ దేశాల్లో గుర్తింపు పొందిన ఈ ఔషధాన్ని తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఊబకాయంతోపాటు మధుమేహాన్నీ ఏకకాలంలో నియంత్రించగల ఈ ఔషధం అనేక ముంది. బాధితులకు ఆశారేఖ కాగలదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మాపుంజారో  ఔషధాన్ని ఇంజెక్షన్ రూపంలో వారానికి ఒక మోతాదు తీసుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో ఔషదాలు, కాస్మెటిక్స్ నియం త్రణ సంస్థ అయిన "సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎసీసీఓ) ఆమోదంతో దీని ధరను 2.5 ఎంజీకి రూ.3,500గా 5 ఎం. జీ రూ.4, 375 గా నిర్ణయించారు. అంటే ఒక నెలకు రూ.14,000 నుంచి రూ.17,900 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. వ్యక్తుల బరువు, ఆరోగ్య స్థితి, ఇతర అంశాల ఆధారంగా ఎంత మోతాదులో ఇవ్వాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు. ఆం దుకు అనుగుణం గా నెలవారీ ఖర్చులో హెచ్చుతగ్గులు ఉంటాయి. నిజానికి ఈ ఔషధాన్ని మనదేశంలో తక్కువ ధరకే తెచ్చారు. యూఎస్ఏలో దీనికి నెలకు 1,000 1,200 డాలర్లు ఖర్చవుతుంది. అంటే మన కరెన్సీలో రూ.86,000 నుంచి రూ.లక్ష జన్నమాట. భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా బాధితులపై పెద్దగా భారం పడకుండా, విలువకు తగిన ప్రయోజనం చేకూరేలా ధరను నిర్ణయించామని ఎలీ లిల్లీ కంపెనీ చెబుతోంది.

ఎలా పని చేస్తుంది?

వారానికి ఒక ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే.. అటు బరువు తగ్గడంతోపాటు ఇటు మధుమేహాన్ని అదుపులో ఉంచే ఔషధాల్లో మొట్టమొదటిది 'మువంజారో' ఇది 'గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రాపిక్ పాలీపెప్టైడ్ (జీఐపీ)', 'గ్లూకగాన్ బైక్ పెప్లైన్-1 (జీఎల్పే-1) హార్మోన్ చెసెస్టోర్లను ప్రేరేపించడం ద్వారా బరువునూ, చక్కెర మోతాదులను నియంత్రిస్తుంది" అని ఏలీ టెల్లీ కం పెనీ చెబుతోంది. ప్రస్తుతానికి ఈ మందు విషయంలో. భారత్లో ఏ స్థానిక కంపెనీతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకోలేదని తెలిపింది. క్లినికల్ బ్రయల్స్ భాగం గా 72 వారాల పాటు.. ఎంపిక చేసిన వ్యక్తులకు తగిన ఆహారం, వ్యాయామాలతోపాటు ఈ మవుంజారో ఔషదాన్ని ఇచ్చి పరిశీలించామని వెల్లడించింది. ఈ మం రు 15 ఎంజ్ మోతాదులో ఇచ్చినవారు 21.8 కిలోలు బరువు తగ్గారని.. 5 ఎంజీ మోరాడు ఇచ్చినవారు 15.4 కిలోల బరువు తగ్గారని తెలిపింది. "భారతీయుల్లో స్థూలరాయం. టైప్-2 డయాబెటిస్తో బాధపడేవారి సం ఖ్య చాలా ఎక్కువే. వారందరికీ ప్రయోజనం కలిగేలా భారతీయ ప్రభుత్వ వర్గాలతో, ఇక్కడి కంపెనీల సహకారంతో ఈ మందుపై అవగాహన కలిగించేందుకు మేం ప్రయత్నిస్తాం" అని ఎలీ ఢిల్లీ ఇండియా ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ విన్సెలోవ్ టక్కర్ పేర్కొన్నారు.

మరికొన్ని మందులున్నా...

బరువు తగ్గించే కొన్ని రకాల మందులు ఇప్పటికే భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నోవో వార్డెక్స్ కంపెనీకి చెందిన 'రైజెల్సస్' ఔషధం మూడేళ్ల కింద అంటే, 2022 జనవరి నుంచే ఇక్కడ వినియోగంలో ఉంది. ఇది ఇప్పటికే యాం టీ-ఒబేసిటీ మందుల దూర్కెట్లో 65 శాతాన్ని చేజిక్కించుకుంది. ర్యూలాగ్లుటైడ్ ఆర్టిస్టాట్, లిలాగ్లుటైడ్ వంటి బ్రాండ్లు కూడా వినియోగంలో ఉన్నాయి. మరోవైపు ఇదే తరహాకు చెందిన 'సెమాగ్లుటైడ్ ఔవధం పేటెంట్ కాలవ్యవధి వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. అప్పుడు దాని జనెరిక్ మందును తయారు చేసిం దుకు ప్రముఖ భారతీయ ఔషధ కంపెనీలు సంసిద్ధంగా ఉన్నాయి. అది తక్కువ ధరలో ఆల రుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వందల కోట్ల మార్కెట్...

పారా బాక్ వంటి మార్కెట్ రీసెర్చ్ సంస్థల అందనా ప్రకారం... భారత్ లో యాంటీ ఒబేసిటీ మందులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ తరహా మందుల మార్కెట్ 2020లో రూ.137 కోట్లుగా ఉండగా.. 2024 నవంబర్ నాటికి రూ.535 కోట్లకు చేరిండ్ ఇది మరింతగా పెరుగుతోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

టైప్-1 డయాబెటిస్ వారికి ఉపయోగపడదు.

మాపుంజారో వారానికి ఒకసారి ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సిన మందు. స్థూలకాయం తోపాటు టైప్-2 డయాబెటిస్ ఉన్నవాడు వాడాల్సిన ఔషధం. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 180 కంటి ఎక్కువగా ఉండి, డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగపడుతుంది. కిడ్నీ. గాల్ బ్లాడర్, సివియర్ గాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు ఉన్నవారు వాడకపోవడమే మంచిది. టైప్-1 డయాబెటిస్ కు పనిచేయదు. కొంతమంది సెలెక్టర్ పాపులేషన్ కు మాత్రమే ఉపకరించే ఔషధం వైద్యుల పర్యవేక్షణలో, వారి సూచనల మేరకు మాత్రమే దీనిని వాడాలి,

- డాక్టర్ శివరాజు, సీనియర్ ఫిజీషియన్


మంచిదే కానీ. ఇదే మ్యాజిక్ డ్రగ్ కాదు.

భారత్ మధుమేహం, స్థూలకాయం సమస్యలు వేగం గా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మౌనంకాదో మం దు ఆశాజనకంగా కనిపిస్తోంది. షుగర్ను తగ్గించడంలోనే కాదు బరువు నియంత్రించడంలో కూడా మంచి ఫలితాలను చూపుతోంది. అయితే ఇదొక్కటే 'మ్యాజిక్' పిల్' అని పరిగణించడం తప్పుడు భావన. దీర్ఘకాలికంగా ఈ మందు ఎలా పనిచేస్తుందో ఇంకా పూర్తి సమాచారం లేదు. దీనికి తోడు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండొచ్చు. అందుకే ఈ మందును ఎవరైనా వాడాలనుకుంటే వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వినియోగించాలి. జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారలు, వ్యాయామం వంటివి కూడా ఈ మందుతోపాటు తప్పనిసరిగా కొనసాగాలి. అప్పుడే మంచి ఫలితాలు రనిపిస్తాయి.

- డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్

 

డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి.

మాపుంజారో మందును కేవలం రాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి ఇవ్వాల్సిన మోతాడు. డయాబెటిస్ నియంత్రణకు ఇచ్చే మోతాదు. వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే వాడాల్సిన మందు అన్నది గుర్తుంచుకోవాలి. బరువు తగ్గించే మందులతోపాటు డయాబెటిసన్ను నియంత్రించే ఈ తరహా మందులు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఈ 'మవుతారో' ఔషధం ప్రపం సవ్యాప్తంగా కాస్తంత గుర్తింపు పొందింది. స్థూలకాయం, అధిక బరువు కారణంగా నొప్పులు. మోకాక్ష అరుగుదలతోపాటు డయాబెటిస్, హైపర్టెన్షన్, స్లీప్ ఆప్నియా వంటి 200 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఉన్న మం దులకు తోడు మరో రెప్యూటెడ్ బ్రాండ్ కావడంతో ఎలీ బిల్లీ వాళ్ల ఔషధం మరో ప్రత్యామ్నాయం అవుతుంది.

- డాక్టర్ గురవారెడ్డి. సీనియర్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ 


ఈ ఔషధం చాలావరకు సురక్షితమే, కానీ...

మవుతారోను ఇప్పుడు అధికారికంగా భారత్లో ప్రవేశపెట్టారుగానీ ఇప్పటికే విదేశాల నుంచి తెప్పించుకుని వాడినవాళ్లు ఉన్నారు. అందులో బరువు తగ్గదమనేది జీఐపీ, జీఎల్పీ-1 హార్మోన్ల ఆధారంగా జరుగుతుంటుంది. బేరియాట్రిక్ సర్జరీలో దాదాపు 200కు పైగా బరువును నియం త్రించే హార్మోన్లలో మార్పులు వస్తాయి. అందులో ముఖ్యమైనవి జీఎట్పీ-1, జీపపీ సాధారణంగా ఇస్సులిన్ ఆధారితంగా చక్కెరను నియంత్రించినప్పుడు బరువు పెరగడం జరుగుతుంది. కానీ ఈ ఔషధంతో ఇటు చక్కెరను అదుపులో ఉంచడం, అటు బరువును తగ్గించడం ఈ రెండూ జరుగుతాయి, ఇది చాలావరకు సురక్షితమైనదే. కొందరిలో మాత్రం వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు, ఆకలి తగ్గడం, మలబద్దకం, కరుపునొప్పి వంటి సమస్యలతోపాటు అరుదుగా కళ్లు మసకబారడం, కిడ్నీ సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు, పాంక్రియాటైటిస్, థైరాయిడ్ కేన్సర్. సివియర్ అలర్జిక్ రియాక్షన్ వంటివి రావచ్చు. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మోతాుడులో వాడాలి. నిజానికి బరువు తగ్గడలచిన కొందరు తమ జీవనశైలి మార్పులతో, ఆహార నియంత్రణతో బరువు తగ్గుతారు. ప్రాణాంతకమైన మార్చిడ్ ఒబేసిటీ ఉన్నవారికి బేరియాట్రిక్ చికిత్స తప్పుడు. కానీ కొందరిలో అటు మార్చిడ్ ఒబేసిటీ కాకుండా, ఇటు జీవనశైలి మార్పులతో బరువు తగ్గకుండా ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారికి ఈ ఔషధం మంచిదే, ఇక బేరియాట్రిక్ చికిత్స తర్వాత కూడా బరువు పెరుగుతున్నప్పుడు ఈ మెడిసిన్ వాడవచ్చు. బరువు తగ్గడం, చక్కెర నియంత్రణ రెండూ జరుగుతాయి కదా అం టూ ఎవరు పడితే వారు వాడటం సరికాదు. లైఫ్సల్ మార్పులతో బరువు తగ్గడమనేది ఎప్పటికైనా మంచిది. జీవనశైలి మార్పులతో ఫలితాలు కనిపించనప్పుడు దీన్ని ఒక ఉత్ప్రేరకంగా (డెక్ స్టార్లా) వాడవచ్చు. తగ్గిన బరువును అలాగే కొనసాగించడానికి జీవసశైలి మార్పులను అనుసరిం చడమే ఆరోగకరం.

- డాక్టర్ అమర్ వెన్నపూస, సీనియర్ బెరియాట్రిక్ సర్జన్

Post a Comment

0 Comments