GET MORE DETAILS

అరుణాచల్ ప్రదేశ్ అవతరించిన రోజు

 అరుణాచల్ ప్రదేశ్ అవతరించిన రోజు


యం. రాం ప్రదీప్

తిరువూరు

9492712836



భారత దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో అరుణాచల్ ప్రదేశ్ ఒకటి. ఈ రాష్ట్రానికి దక్షిణాన అస్సాం రాష్ట్రం, ఆగ్నేయాన నాగాలాండ్, తూర్పున బర్మా, పశ్చిమాన భూటాన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఇటానగర్ రాష్ట్ర రాజధాని. 

అరుణాచల్ ప్రదేశ్ లో వాతావరణం ఎత్తును బట్టి మారుతూ ఉంటుంది. టిబెట్ సరిహద్ద్దుకు దగ్గరగా, ఎగువ హిమాలయాల వద్ద ఉన్న ఎత్తైన ప్రదేశాల్లో అతిశీతల వాతావరణం నెలకొని ఉంటుంది. మధ్య హిమాలయాల వద్ద సమశీతోష్ణ స్థితి ఉంటుంది. యాపిల్, కమలా పండ్ల వంటివి పండుతాయి. దిగువ హిమాలయాలు, సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణ వాతావరణం ఉంటుంది. రాష్ట్రంలో వర్షపాతం చాలా ఎక్కువ; సాలుకు 2,000 నుండి 4,000 మి.మీ (80 నుండి 160 అంగుళాలు) వర్షపాతం నమోదవుతుంది. పర్వత సానువుల్లో రోడోడెండ్రన్, ఓక్, పైన్, మేపుల్, ఫర్, జూనిపర్ మొదలైన వృక్షాలతో కూడిన అరణ్యాలు విస్తరించి ఉన్నాయి.

అరుణాచల్ ప్రదేశ్ ప్రశాంత నిర్మల వాతావరణం దేశవిదేశాల నుండి అనేకమంది యాత్రీకులను ఆకర్షిస్తుంది. స్థానికంగా కూడా అనేకమంది ప్రజలు అరుణాచల్ ప్రదేశ్ విభిన్న సంస్కృతిని ఆస్వాదించడానికి బొండిలా, తవాంగ్, తిరప్ మొదలైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు.1987 ఏప్రిల్ 20న అరుణాచల్ ప్రదేశ్ తో పాటు మిజోరాం కూడా ఏర్పడింది.

Post a Comment

0 Comments