GET MORE DETAILS

మధుమేహం - పాద సంరక్షణ

 మధుమేహం - పాద సంరక్షణమదుమేహ రోగులలో 15 శాతం మంది తమ జీవిత కాలంలో పాదాల అల్సర్లతో బాధపడు తుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2025 నాటికి ప్రపంచ మధుమేహ రోగుల సంఖ్య 380 మిలియన్లకు చేరుకోవచ్చని అంచనా అందులో భారతీయులు అధికంగా ఉండవచ్చు. మధుమేహవ్యాధి ఉన్నవారిలో నరాల బలహీనత వలన కాలికి హాని కలుగుతుంది. సరైన సమయంలో సరైన వైద్యాన్ని అందించకపోయినచో కాళ్ళు, పాదాలు మరియు కాలివేళ్ళ నిర్మాణంలో జీవ యాంత్రిక మార్పులు చోటుచేసుకుంటాయి మరియు ఇన్ఫెక్షన్, అల్సర్ల వల్ల ఆ భాగాన్ని తొలగించేయాల్సి రావటం, కొన్ని సమయాలలో ఇది మరణానికి కూడా దారితీయవచ్చును. చూపు మందగించటం, కీళ్ళ కదలికలలో సమస్యలు మరియు సరియైన పాదరక్షలను ధరించకపోవటం వలన కూడా మదుమేహ రోగులకు ఆల్సర్లు ఏర్పడతాయి.

మధుమేహ రోగులలో అదిక బ్లడ్ షుగర్ రక్త నాళాలలో ప్రవాహాన్ని తగ్గిస్తుంది, నాడుల అంచులు దెబ్బ తింటాయి తద్వారా పాదాలు పూర్తిగా స్పర్శజ్ఞానాన్ని కోల్పోతాయి మరియు చర్మం పొడిగా తయారవుతుంది. ఇది ముందు ముందు న్యూరోపదిక్ ఆర్థ్రోపతికి (చార్ కోట్ పూట్) దారితీస్తుంది.

న్యూరోపక్ అల్సర్లను తగ్గించుటలో ప్రాధమిక ๒๐๐ రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణ (RBS <180 mg/dl & HbA 1c<7%) సమతులాహారం మరియు దేహంలో తేమ స్థాయిని కాపాడుకొనుట ఇతర ముఖ్యాంశాలు ధూమపానాన్ని ఆపివేయుట.

పాదాల కొరకు తీసుకోవల్సిన ముఖ్య జాగ్రత్తలు: రోగి ప్రతిరోజూ తన పాదాలను పరీక్షించుకోవటం ద్వారా గాయాల సమస్యలను ముందుగా గుర్తించగల్గుతారు.

ఆరోగ్య సంరక్షకులచే వార్షిక పాదాల మరియు పాదరక్షల చెకప్: తమ పాదాలను సంరక్షించుకునే మధుమేహ రోగుల కంటే, పాద సంరక్షణను పట్టించుకోని రోగులలో పాదాల అల్సర్లు వచ్చే ప్రమాదం 6.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

చర్మ సంరక్షణ : పాదాలను శుభ్రంగా, మృదువుగా మరియు పొడిగా (ప్రత్యేకించి కాలి వేళ్ళ మధ్య) ఉంచుకోవాలి. పాదాలను ఏ సమయంలో నైనా 3-4 నిమిషాల కన్నా ఎక్కువ సేపు తడుపరాదు. మధుమేహం గల పేషెంటు పాదాలకు ఏమీ ధరించకుండా వెళ్ళరాదు. చలికాలంలో వెచ్చని, ప్యాడ్లుగల కాటన్ సాక్స్ను ధరించినచో చలి మరియు తేమ వాతావరణం నుండి పాదాల చర్మానికి రక్షణ లభిస్తుంది. ఆనెల ప్లాస్టర్లు లాంటి కన్స్ట్రక్టింగ్ టేప్ లేదా అతికించే ఉత్పత్తులను పాదాలకు ఉపయోగించకూడదు. కాయగాచిన వాటిని తొలగించడం లేదా షేవ్ చయడం అనేది హెల్త్కేర్ ప్రొఫెషనల్తో మాత్రమే చేయించాలి.

గోళ్ళ సంరక్షణ: మందంగా ఉన్న గోళ్ళను ఫంగల్ ఇన్ఫెక్షన్ కొరకు తనిఖీ చేయించుకోవాలి.

పాదరక్షలు ఎంచుకోవడం:

సరియైన సమయంలో తగినంత పాదం సైజుగల చెప్పులు, మడమకు చాలినంత ఆధారం, చక్కని ఆర్చి ఆధారంతో కుషన్, కాలివేళ్ళ వెడల్పునకు తగిన స్థలం ఉండేవి ఎంచుకోవడం చాలా ముఖ్యం.

ఎక్కువ బిగుతుగా ఉండే చెప్పులు పాదాలకు ఒరుసుకు పోయి అల్సర్లు, తీవ్రమైన ఇన్ఫెక్షన్ మరియు వాటి సమస్యలకు, వేళ్ళలోపలికి గోళ్ళు పెరగడం, ఆనెలు మరియు పాదాల వైకల్యానికి దారితీస్తాయి. మధ్యాహ్నం పాదాలు వ్యాకోచించి ఉంటాయి కనుక ఆవేళల్లోనే చెప్పులు కొనవలెను. తరచూ పాదాల కొలత తీసి మారుతున్న నిర్మాణానికి తగిన కొత్త చెప్పులు కొనవలెను. పాదానికి తగిన ఆకారంలో మరియు గట్టి మడమ కౌంటర్ తో మెత్తటి మెటీరియల్ తో చేయబడినవై, ప్యాడింగ్ మరియు కాలిబొటన వేలి బాల్ వద్ద వంగే గుణం ఉండవలెను మరియు లోతైన మరియు వెడల్పుగల కాలివేళ్ళ బాక్స్ మరియు చక్కని ఆర్చి ఆధారం ఉండవలెను. లేసులు గల షూష్ సులభంగా ఫిట్ అవుతాయి మరియు మీ నిర్దిష్ట అవసరాలకు అనువుగా ఉంటాయి. కాలి వేళ్ళకు ఇరుకుదనం, ఎత్తైన మడమలు, గట్టి సోల్స్. వేళ్ళ మధ్య (తాంగ్స్) ఉండరాదు. చిరిగిన లైనింగ్స్ లోపల ఇతర పదార్థాలు మరియు గరుకైన భాగాలు లేకుండా రోజూ షూసు తనిఖీ చేసుకోవాలి.

రోజూ పాదాల పరిశీలన: రోజూ స్నానం లేదా షవర్ తర్వాత మరియు షూస్ మరియు సాక్స్ వేసుకోవడానికి ముందుగా పాదాలను తనిఖీ చేసు కోవాలి. పేషెంట్ పాదం యొక్క అన్ని కోణాలను పరిశీలించుటకు చేతి అద్దం ఉపయోగించవచ్చు. పాదాల తనిఖీకి 2 మార్గాలు- చూడండి మరియు తాకండి. ఏదేని ఉష్ణోగ్రత మార్పులకు పాదాన్ని తాకండి: అద్దాన్ని వాడుతూ కాలివేళ్ళ మధ్య, ప్రక్కలు, అడుగుభాగం, పైన మరియు వివిధ వైపుల పాదాన్ని చూడండి. నీలి, లేత ఎరుపు లేదా తెల్లని మచ్చలాంటి ఏదేని రంగు మార్పులు అలానే చర్మం మీద పగుళ్ళు, బొబ్బలు, కోత, పుండ్లు లేదా చీలికలను గమనించవలెను మదుమేహులు దీర్ఘ కాలంలో వచ్చే చిక్కులను తగ్గించడానికి తరచుగా పాదాన్ని పరిశీలించడమూ లక్ష్యంగా పెట్టుకోవాలి. బహుళ ప్రయోజనాలుగల వైద్య విధానం ద్వారా పాదాల బాగాలను తొలగించే అవకాశాన్ని తగ్గించడంతోపాటు అల్సర్ నివారణలో మెరుగైన ఫలితాలను పొందవచ్చును.

డా. కుమార్ కృష్ణమోహన్ కోగంటి

కన్సల్టెంట్ జనరల్ & లాప్రోస్కోపిక్ సర్జన్ 

రెనోవా హాస్పిటల్స్, కొంపల్లి 

సంప్రదించు నంబర్: 9121241005

Post a Comment

0 Comments