మేష రాశి ఫలితాలు 2024
కొత్త ఏడాదిలో మేష రాశి వారికి ఆకస్మిక ధన లాభం.. అయితే ఖర్చులు కూడా 2024 జ్యోతిష్యం ప్రకారం, మేష రాశి వారికి అంగారకుడు(కుజుడు) అధిపతిగా ఉంటాడు. ఈ కారణంగా వీరికి ధైర్యం, కోపం చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు. మేష రాశి వారు కొత్త ఏడాదిలో ఊహించని లాభాలను పొందుతారు. అదే విధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. గత ఏడాదితో పోలిస్తే నూతన సంవత్సరంలో మంచి ఫలితాలొస్తాయి. పెండింగ్ పనులన్నీపూర్తవుతాయి.
మే 2024 నుంచి గురుడు ఈ రాశి నుంచి రెండో స్థానంలో సంచారం చేయడం వల్ల మెరుగైన ఫలితాలొస్తాయి. రాహువు, కేతు గ్రహాల ప్రభావంతో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో మేష రాశి వారికి ఏయే శుభ, అశుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ రాశి నుంచి గురుడు ప్రత్యక్ష రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీ జీవితంలో గొప్ప ఫలితాలు వస్తాయి. ప్రారంభ నెలల్లో అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఆనందంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. గురుడి శుభ ప్రభావంతో కొత్త జంటలకు సంతాన భాగ్యం కలుగుతుంది. కొత్త ఏడాదిలో శని దేవుడు ఈ రాశి నుంచి 11వ స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో శని దేవుడు బలమైన స్థానంలో ఉండటం వల్ల మేష రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. గురుడు, శని రెండు గ్రహాలు కలిసి ఒక ఇంటిని ప్రభావితం చేసిన కాలంలో మెరుగైన ఫలితాలొస్తాయి.
ఈ కారణంగా కొత్త ఏడాదిలోని మొదటి నాలుగు నెలలు కుటుంబంతో పాటు సమాజంలో కూడా మంచి గౌరవం లభిస్తుంది.నవ గ్రహాలలో రారాజుగా పరిగణించే సూర్య దేవుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు ఉన్నత స్థితిలో ఉంటారు. కొత్త ఏడాదిలో సూర్యుడు, గురుడు కలిసి గొప్ప రాజయోగాన్ని ఏర్పరచనున్నారు. ప్రభుత్వ రంగంలో పని చేసే వ్యక్తులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్తగా ఏదైనా మార్పులు చేయాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఏప్రిల్ నుంచి మే నెల వరకు సమయం అనుకూలంగా ఉంటుంది.
కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి రాహువు పన్నెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యవహారాల్లో శుభ ఫలితాలొస్తాయి. రాహువు ప్రభావం శుభప్రదంగానే ఉంటుంది. మీ ఇంట్లో సంతోషకరంగా ఉంటుంది. మీరు కొన్ని విలాసవంతమైన సౌకర్యాలను పొందుతారు. విదేశీ వ్యాపారాలు చేయాలనుకునే వారు మంచి ఫలితాలను పొందుతారు. కొత్త ఏడాదిలో కేతువు ఈ రాశి నుంచి ఆరో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. కేతువు ప్రభావంతో మీరు శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది. ఏదైనా కోర్టు సంబంధిత కేసులు పెండింగులో ఉంటే, అవి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు సానుకూల మార్పులొస్తాయి. శత్రువులు ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని ఓడించలేరు.
మేష రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలొస్తాయి. మీకు తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవతంలో సంతోషంగా గడుపుతారు. మీ పూర్వీకుల నుంచి ప్రయోజనాలు పొందుతారు. మేష రాశి వారికి కొత్త ఏడాదిలో ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్, జూన్ మధ్య, అక్టోబర్, నవంబర్ నెలలో ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది.
కొత్త ఏడాదిలో మేష రాశి వారికి నక్షత్రాల ప్రభావంతో ప్రతికూల ఫలితాలు రావొచ్చు. రాహువు 12వ స్థానంలో ఉండటం వల్ల మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చికిత్స సంబంధించిన విషయాల్లో అజాగ్రత్తగా ఉండొద్దు.
0 Comments