GET MORE DETAILS

ఉగాది పచ్చడి విశిష్టత

 ఉగాది పచ్చడి విశిష్టత



"ఉగాది"నాడు చేసుకొనే పచ్చడి ఎంతో ప్రాముఖ్యమైనది. షడ్రుచుల పచ్చడిని ఆరగించడం వెనుక జీవితసారం గోచరిస్తుంది. ఈ పచ్చడిలో...

మధురం(తీపి), 

ఆమ్లం(పులుపు), 

కటు(కారం), 

కషాయ(వగరు), 

లవణం(ఉప్పు), తిక్త(చేదు) 

రుచులు మిళితమై ఉంటాయి.

ఈ ఆరు రుచులు జీవతంలో ఎదురయ్యే...

సంతోషం(తీపి), 

దుఃఖం(చేదు), 

కోపం(కారం), 

భయం(ఉప్పు), 

విసుగు(చింతపండు), 

ఆశ్చర్యం/సంభ్రమం(మామిడి) సమ్మేళనం. 

అంతేకాకుండా ఈ ఆరు రుచులు ఆరు రకాలైన లాభాలను కలుగచేస్తున్నవి.

• కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది.

• చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది.

• పచ్చి మిరపకాయలో విటమిన్ C అధిక స్థాయిలో ఉంది.

• మామిడి ముక్క జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది.

• వేప పువ్వు చేసే మేలు పలు విధాలుగా ఉంటుంది. 

వేప చెట్టుకి ఆయుర్వేదంలో విశేష స్థానం ఉంది. 

సంవత్సరం మొత్తం అన్ని రుచుల్ని కలగలిపి ఆయుర్వేద విలువలతో కూడిన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలనే అంతర్లీన సందేశం మన ఉగాది పచ్చడి లో ఉంది. సంవత్సరం మొత్తంశారీరక మరియు మానసిక ఆరోగ్య సమతుల్యత పై శ్రద్ద పెట్టాలనే అద్భుత సందేశాన్ని సులువుగా చేసుకునే ఒక పచ్చడి అనే ఆచారం లో నిక్షిప్తం చేయడం మన హిందూ సంస్కృతిసంప్రదాయాల గొప్పతనం.

Post a Comment

0 Comments