GET MORE DETAILS

గాడి తప్పితే... వీడియోలపై కొరడా!

 గాడి తప్పితే... వీడియోలపై కొరడా!



ఆన్లైన్ వీడియో ఫ్లాట్ఫాం యూట్యూబ్ నిరుడు చివరి మూడు నెలల్లో 90 లక్షల వీడియోలను తొలగించింది. నిర్దేశిత మార్గదర్శకాలను అవి ఉల్లంఘించడమే దానికి కారణం. ఇందులో నాలుగో వంతు భారతీయులు అప్లోడ్ చేసినవే!

నిరుడు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత్ నుంచి అప్లోడ్ అయిన 22.25 లక్షల వీడియోలను తొలగించామని, 30 దేశాల్లో మనదే అగ్రస్థానమని యూట్యూబ్ ఇటీవల ప్రకటిం చింది. రెండు, మూడో స్థానాల్లో నిలిచిన సింగపూర్, అమెరికాలకు '' సంబంధించి తొలగించిన వీడియోలు కలిపినా మనకంటే తక్కువే. దీన్నిబట్టి సామాజిక మాధ్యమాల్లో, ఆన్లైన్ వేదికల్లో మనం ఎంత చెత్త నింపుతున్నామో అర్థమవుతుంది. వినియోగదారులే తమకు నచ్చిన, లేదా తాము రూపొందించిన వీడియోలను ఉచితంగా అప్ లోడ్ చేయగలిగే వేదిక యూట్యూబ్. ఆ వీడియోల్లో విషయం నచ్చి, వీక్షకుల సంఖ్య పెరిగేకొద్దీ ఆదాయం వస్తుంది. ఇలా యూట్యూన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వార్తలు, రాజకీయాలు, సినిమాలు, క్రీడల ఆధారిత వార్తాం ' శాలతో నడిచే యూట్యూబ్ ఛానళ్లు దేశీయంగా పెద్దసంఖ్యలో ఉన్నాయి. వాటిలో ఉన్న విషయాన్ని బట్టి వేలు, లక్షల మంది అను సరిస్తున్నారు. వీక్షకులను ఆకట్టుకుని మరింత ఎక్కువగా ఆర్జించా. అనే ఆశతో చాలామంది నిబంధనలను అతిక్రమించి యూట్యూబ్ చానళ్లలో వీడియోలు పెడుతున్నారు. ఇలాంటి వాటిని తొలగిస్తున్నట్లు యూట్యూబ్ చెబుతోంది.

మోసాలకు ఆస్కారం:

పిల్లల భద్రతకు ప్రమాదకరంగా ఉన్నవి, హింస, నగ్న, అశ్లీల దృశ్యాలు, తప్పుడు సమాచారంతో కూడినవి, మోసాలను ప్రోత్సహించే వీడియోలను యూట్యూబ్ తొలగిస్తుంది. ఇలాంటి వీడియోలలోని దృశ్యాలు నిబంధనలను అతిక్రమించేలా ఉన్నాయని హెచ్చరిస్తుంది. మూడు నెలల వ్యవధిలో మూడుసార్లు యూట్యూబ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినా, తీవ్రమైన దుష్ప్రవర్తనకు పాల్పడినా అలాంటి ఛానళ్లను రద్దుచేస్తోంది. ఇలా ఒక ఛానల్పై వేటు వేస్తే దానిలోని వీడియోలన్నీ తెరమరుగైనట్లే. ఈ వివరాలతో త్రైమాసిక నివేదికను విడుదల చేస్తోంది. ఈ క్రమంలో గతేడాది చివరి మూడు నెలల్లో దాదాపు 90 లక్షల వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్ వెల్లడించింది. అసభ్య పదజాలంతో నిండినవి, వ్యక్తులూ సంస్థల పరువుకు భంగం కలిగించేవి వీటిలో ఉన్నాయి. లైకులూ కామెంట్ల కోసం ఉన్నదీ లేనిదీ పోగేసి గాలికబుర్లతో నింపినవి, లోపల ఉన్న అంశానికి సంబంధం లేకపో యినా వీక్షకులను ఆకర్షించేందుకు ద్వంద్వార్థాలతో కూడిన ధంబ్ని యిల్స్ పెట్టిన వీడియోలనూ యూట్యూబ్ తొలగిస్తోంది. సులువుగా కోట్లు సంపాదించడం ఎలా? ఆరు నెలల్లోనే మీ స్టేటస్ మారిపోయేలా ఆర్జించాలనుకుంటున్నారా? ఇలా ఆర్ధిక పరమైన మోసాలకు ఆస్కారం కల్పించేలా ఉన్నవి, చైన్ మార్కెటింగ్, నెట్వర్కింగ్ బిజినెస్లకు సంబంధించిన వీడియోలనూ యూట్యూబ్ తీసివేస్తుంది.

వాస్తవాలకు దూరంగా...

ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం ఎంత సులువో దానికి విశ్వసనీయమైన వీక్షకులను సంపాదించుకోవడం అంత కష్టం. అందుకే దశాబ్దాల కిందటే మొదలైన పెద్ద పెద్ద సంస్థల యూట్యూబ్ లక్షల్లో వీక్షకులు రావడానికి సంవత్సరాల సమయం పడు తోంది. పార్టీలను, సినీ నటులను ట్రోల్ చేస్తూ వీడియోలు చేసే యూట్యూబ్ చానళ్లకు కొన్ని నెలల్లోనే లక్షల్లో వీక్షకులు చేరుతున్నారు. అశ్లీల, అసభ్య దృశ్యాలున్న వీడియోలను పెట్టే ఛానళ్లకైతే తక్కువ సమయంలోనే వేలు, లక్షల సంఖ్యలో సబ్స్క్రైబర్లు చేరుతున్నారు. అయితే, ఇలాంటి వీడియోలున్న ఛానళ్లను యూట్యూబ్ సైతం అంతే వేగంగా తొలగించేస్తోంది. వాస్తవాలకు దూరంగా, నానా చెత్తా చెదారం, విశృంఖలత్వం నింపి వీడియోలు రూపొందించి అప్లోడ్ చేయడం చాలా సులువని, అందుకే ఇలాంటివి పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయంగా యువత పెద్దసంఖ్యలో ఉంది. వారిలో చాలామంది తేలిగ్గా ఆదాయం ఆర్జించడా నికి నిబంధనలను అతిక్రమించి వీడియోలు రూపొందించి యూట్యూ బ్లో అప్లోడ్ చేస్తున్నారు. కేవలం లైకులు, కామెంట్లు, సబ్ప్రైబర్ల సంఖ్య పెంచుకొని ధనం ఆర్జించడమే లక్ష్యంగా వీడియోలు పెట్టే యూట్యూబ్ ఛానళ్లు ఎంతోకాలం మనలేవని గుర్తించాలి. విశ్వసనీయ తతో పదిమందికీ ఉపయోగపడేలా, సమాజంలో విజ్ఞానం చైతన్యం నింపేలా నిర్వహించే యూట్యూబ్ ఛానళ్లే చిరకాలం నిలుస్తాయి. ఆదాయం, ఆదరణ పొందుతాయి.

- ముఖర్జీ కొండవీటి

Post a Comment

0 Comments