GET MORE DETAILS

మునక్కాయ ప్రాధాన్యత : ఆరోగ్య ప్రయోజనాలు

 మునక్కాయ ప్రాధాన్యత : ఆరోగ్య ప్రయోజనాలు



మునక్కాయ ప్రియులకు ఈ సీజన్ పండగే పండగ వేసవిలో ఇవి బాగా కాస్తాయి. సాంబారు, తీయ పులుసు, మజ్జిగ పులుసు, చారు, రకరకాల కూరల్లో మునక్కాయలను వాడతాం. అంతేకాకుండా. మునక్కాయలతో ఊరగాయ కూడా పెడతాం. మునగాకుతో బోలెడు వంటకాలు చేస్తారు. ఇంత ప్రాధాన్యత ఉన్న మునక్కాయ, మునగ ఆకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో... అవేమిటంటే...

• వీటిల్లో పోషకాలు బాగా ఉన్నాయి. మునగకాయల్లో సి-విటమిన్ ఉంది. జలుబు చేసినపుడు మునక్కాడల సూప్ తాగితే ఎంతో సాంత్వన పొందుతారు.

• ఆస్తమా, బ్రాంకైటిస్, టీబీ వంటి శ్వాసకోశ సంబంధ జబ్బుల నివారణలో మునగ ఆకు బాగా పనిచేస్తుంది.

•ఐరన్, కాల్షియం, విటమిన్లు మునగలో బాగా ఉన్నాయి. ఎముకలకు బలం చేకూరుస్తాయి. రక్తాన్ని శుభ్రం చేస్తాయి.

• మునగకాయలు, ఆకులతో చేసిన వంటకాలు తినడం వల్ల ప్రసవం సులభంగా అవడంతోపాటు ప్రన వానంతర సమస్యలు కూడా తగ్గుతాయి.

• మునగ ఆకులతో చేసిన వంటకం వల్ల బాలింతల్లో తల్లిపాలు వృద్ధిచెందుతాయి. మునగ ఆకుల్లో కాస్త ఉప్పవేసి నీళ్లల్లో ఉడికించాలి. తర్వాత అందులోని నీళ్లను వార్చేసి ఉడికిన మునగా కులో కొద్దిగా నెయ్యివేసుకుని తింటే బాలింతలకు మంచిది.

• మునగకాయల్లో యాంటీ బ్యాక్టీరియల్ సుగుణాలు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకపు ముఖ్యంగా గొంతు, చర్మం, ఛాతీ ఇన్ఫెక్షన్లు రావు. చర్మానికి సంబంధించిన ఫంగల్ సమస్యలపై కూడా బాగా పనిచేస్తాయి.

• జీర్ణసమస్యలతో బాధపడేవారికి మునగ ఆకు చాలా మంచిది. కలరా, జాండిస్, విరోచనాలు వంటి వాటికి చికిత్స తీసుకునేటప్పుడు ఒక చెంచా మునగ ఆకు జ్యూసులో తేనె కలిపి ఆ మిశ్రమాన్ని కొబ్బరిబొండాం నీళ్లల్లో కలిపి రోజుకు రెండుమూడుసార్లు తాగితే మంచిది.

• మునగకాయ పొట్టులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ జ్యూసును యాక్నే, పులిపిరులు, చర్మ సంబంధిత సమ స్యలకు వాడొచ్చు.

• వ్యంధత్వ నివారణలో కూడా ఇది పనిచేస్తుంది. లైంగికశక్తిని పెంచుతుంది.

• మూత్రంలో మంట వంటి సమస్యలపై కూడా బాగా పనిచేస్తుంది.

• తరచూ మునగకాయలు, మునగ ఆకులు తినడం వల్ల అల్సర్, పెద్దపేగు ట్యూమర్లు రాకుండా నిరోధి స్తుంది. కాన్సర్ వచ్చే అవకాశాలను అడ్డుకుంటుంది.

• గర్భాశయంపై వచ్చే కంతుల పరిమాణాన్ని తగ్గి స్తుంది.

• గాల్ బ్లాడర్ బాగా పని చేస్తుంది. మధుమేహ వ్యాధి గ్రస్థుల్లో చక్కెర ప్రమాణాలు పెరగకుండా చూస్తుంది.

Post a Comment

0 Comments