మే నెలలో పుట్టిన వారు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారో తెలుసా...?
జోతిష్య శాస్త్ర ప్రకారం మనం పుట్టిన నెలను బట్టి మన జాతకాన్ని, భవిష్యత్తును తెలుసుకోవచ్చు. రాబోయో మే నెలలో సూర్యుడు మేషం మరియు వృషభ రాశిలో సంచరించనున్నాడు. దీంతో మే నెలలో పుట్టిన వారిపై సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మే నెలలో పుట్టిన వారిపై సూర్యుని యొక్క లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కనుక జోతిష్య శాస్త్రం ప్రకారం మే నెలలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఏవిధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మే నెలలో జన్మించిన వ్యక్తులు ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడతారు.
ఎలాంటి సమస్యను ఎలా ఎదుర్కోవాలో వారికి బాగా తెలుసు. అలాగే మే నెలలో పుట్టిన వారు కొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతారు. వీరిలో న్యాయకత్వ లక్షణాలు ఇమిడి ఉంటాయి. ఇక మే నెలలో పుట్టిన వారు కొత్త విషయాలను వెతుకుతూ ఉంటారు. అలాగే వీరు కొత్త సాంకేతికను ఉపయోగించి విద్యను నేర్చుకోవడానికి ఇష్టపడతారు. మే నెలలో జన్మించిన వ్యక్తులు పెయింటింగ్, ఫోటోగ్రఫీ, సృజనాత్మక కార్యకలాపాలతో పాటు చదవడానికి, రాయడానికి ఇష్టపడతారు. ఈ రంగాల్లో కెరీర్ ను ఎంచుకోవడానికి మక్కువ చూపుతారు. అలాగే మే నెలలో పుట్టిన వారు అందరితో కలిసి జీవించడానికి ఇష్టపడతారు.అలాగే వీరు సానుభూతిని ఎక్కువగా కలిగి ఉంటారు. దీంతో అందరితో వారి బంధాలు ఎక్కువ కాలం పాటు కొనసాగుతాయి.
ఇక మే నెలలో పుట్టిన వారు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా కూడా ఎదుగుతారు. అలాగే మే నెలలో పుట్టిన వారు ఏ పనినైనా చాలా శ్రద్దతో చేస్తారు. అంతేకాకుండా వారు చేసే పనిని ఖచ్చితంగా పరిపూర్ణంగా చేస్తారు. వీరు ఎంచుకున్న లక్ష్యాలను కూడా పూర్తి చేయడానికి ఉత్సాహం చూపిస్తారు.
కుజుడి సంచారం వల్ల వచ్చే 37 రోజుల పాటు ఈ 5 రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 23 న కుజుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. ఏప్రిల్ 23 మంగళవారం హనుమాన్ జయంతి నాడు ఈ సంచారం జరగడం వల్ల ఈ కుజ సంచారం చాలా ప్రత్యేకం అయ్యింది. అంతేకాకుండా ఈ రోజున యాదృచ్చిక సంఘటనలు జరిగాయి. భూమి నిర్మాణం, అంగారక సంచారంతో పాటు హనుమాన్ జయంతి కావున ఈ కుజ సంచారం చాలా శుభప్రదం. ఈ సంచారం అన్ని రాశులపై ప్రభావాన్ని చూపించినప్పటికి ఈ 5 రాశుల వారికి ఈ సంచారం మరింత శుభప్రదం కానుంది.
కుజుడు ఏప్రిల్ 23 నుండి జూన్ 1 2024 వరకు మీనరాశిలోనే ఉండనున్నాడు. కుజుడు దాదాపు 37 రోజుల పాటు మీనరాశిలో ఉండి ఈ 5 రాశుల వారికి మరింత మేలు చేయనున్నాడు. కుజుడి సంచారం వల్ల మేలు కలగనున్న 5 రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కుజుడి సంచారం మేలు చేయనున్న 5 రాశులల్లో వృషభ రాశి ఒకటి. వృషభ రాశి వారికి కుజుడి సంచారం చాలా శుభప్రదం కానుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వీరు కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి. ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతుంది.
వ్యాపారులకు ఈ కాలం ఎంతో కలిసి రానుంది. కుజుడు సంచారం వల్ల మేలు కలిగే రాశులల్లో మిథున రాశి ఒకటి. వీరి ఆదాయం పెరుగుతుంది. కెరీర్ లో విజయాలు సాధిస్తారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల నుండి ఆనందం కలుగుతుంది. వ్యాపారులకు మేలు కలుగుతుంది. ఈ రాశి వారు తండ్రి నుండి శుభవార్త వింటారు. అలాగే కన్య రాశి వారికి కూడా కుజుడు సంచారం మేలు చేయనుంది. కుజుడి సంచారం కన్యారాశి వారికి భాగస్వామి పరంగా మంచి ప్రయోజనాలను ఇస్తుంది. వైవాహిక జీవితం చాలా చక్కగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ ఆస్తుల వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు కష్టపడి పని చేసి మంచి ఫలితాలను పొందుతారు.
అలాగే కుజుడి సంచారం వృశ్చిక రాశి వారికి కూడా మేలు చేయనుంది. కుజుడు ఈ రాశి వారికి విశేషమైన వరాలు కురిపిస్తాడు. ఈ రాశి వారు వారి కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. జ్ఞానాన్ని పొందడానికి, కెరీర్ ను సరైన మార్గంలో నడిపించడానికి ఈ సమయం చాలా మంచిది. మీరు చేసే పనులల్లో మీ జ్ఞానం మరియు విచక్షణ కారణంగానే విజయం లభిస్తుంది. అలాగే కుంభ రాశి వారికి కూడా కుజుడి సంచారం మేలు చేయనుంది. ఈ రాశి వారు వారి అత్తమామల నుండి భారీ ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లో సంపద పెరుగుతుంది. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. ఈ విధంగా కుజుడి సంచారం ఈ రాశుల వారికి మరింత మేలు చేయనున్నదని పండితులు చెబుతున్నారు.
0 Comments