కార్తీక సోమవారం ప్రాధాన్యత
కార్తీకమాసంలో సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంది. అందరూ కూడా సోమవార 'ఉపవాసం' చేస్తాం అంటారు..
అసలు ఈ సోమవార వ్రతం ఎన్ని రకాలుగా ఆచరించవచ్చు!!
కార్తీక సోమవారాన్ని 6 విధాలుగా ఆచరించవచ్చు
1. ఉపవాసం
2. ఏకభుక్తము
3. నక్తము
4. అయాచితము
5. స్నానము
6. తిలదానము
1. ఉపవాసము:
దీనిని ఆచరించేవారు పగలంతా ఏమీ తినకుండా సూర్యాస్తమయము తర్వాత శివుణ్ణి పూజించి, నక్షత్ర దర్శనం చేసుకుని కేవలం తులసి తీర్థం మాత్రమే సేవిస్తారు...
2. ఏకభుక్తము:
రోజంతా ఉపవాసం చేయలేనివారు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి పూట భోజనం బదులు తులసి తీర్థం సేవిస్తారు...
3. నక్తము:
పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారం (టిఫిన్) కానీ సేవిస్తారు..
4. అయాచితము:
రోజంతా ఉపవాసం ఉండి తమ భోజనం తాము వండుకోకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే దానిని అయాచితము అని అంటారు..
5. స్నానము:
పైన చెప్పిన నాలుగు విధాలు చేయలేనివారు స్నాన జపాదులు మాత్రమే చేస్తారు.
6. తిలదానము:
మంత్ర జప విధులు తెలియని వాళ్లు కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసిన చాలు.
▪️పై ఆరు విధాలలో ఏ విధానం ఆచరించినా కానీ, విశేషమైన ఫలితం వస్తుంది అని కార్తీక పురాణంలో చెప్పబడి ఉన్నది.
▪️కాబట్టి, ఈ కార్తీక మాసాన్ని ఎవ్వరు కూడా వృధా చేసుకోవద్దు... ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఇలాంటి అరుదైన మాసము...
▪️నక్తము చేయడం అనేది చాలా చాలా మంచిది. కార్తీక సోమవారం రోజున ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయండి.
▪️మీ మీ శక్తిమేర సోమవారం రోజున పైన చెప్పిన 6 ఆచరణ విధానాలలో ఏదైనా ఆచరించి తరించండి.

0 Comments