మగ పిల్లలకు వివాహ ప్రాప్తి కొరకు ప్రత్యేక పూజ
పూజ్య గురుదేవులు,"ధార్మిక వరణ్య" బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ధర్మవర్ధిని ట్రస్ట్ మరియు హైదరాబాద్ దీప్తిశ్రీనగర్ లోని శ్రీరామాలయము సంయుక్త నిర్వహణలో "మగ పిల్లలకు వివాహ ప్రాప్తి" కొరకు ప్రత్యేక పూజ నిర్వహింపబడుతున్నది.
మగ పిల్లలకు సానుకూలవతి అయిన మంచి భార్య లభించి, వారి దాంపత్య మరియు కుటుంబ జీవనము ఎంతో చక్కగా సాగుట కొరకు సంకల్పింపబడి, శశాస్త్రీయముగా జరుగబోవు ఈ కార్యక్రమములో పెళ్లికాని మగ పిల్లలు పాల్గొనవచ్చును.
ఈ కార్యక్రమము హైదరాబాద్ లోని దీప్తిశ్రీనగర్ లో గల శ్రీరామాలయ ప్రాంగణములో నవంబర్ 15, 2025 (శనివారం) నాడు ఉదయం 8:30 AM నుండి మధ్యాహ్నం 1 PM వరకు జరుగును.
ఈ కార్యక్రమమునకు ఎటువంటి ప్రవేశ లేదా రిజిస్ట్రేషన్ రుసుము (Entry/Registration fees) లేదు. పూర్తిగా ఉచితం. మంచి వైవాహిక జీవితము కావాలి అని కోరుకునే పెళ్ళికాని మగపిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చును.
ఈ కార్యక్రమములో పాల్గొనుటకు మీ వివరములతో ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు:
0 Comments