Do Not Disturb (DND 3.0) By Telecom Regulatory Authority of India (TRAI)
రోజంతా క్రెడిట్ కార్డ్‌లు, లోన్‌యాప్స్ వంటి ప్రమోషనల్ కాల్స్‌తో విసిగిపోతుంటాం. వాటికి అడ్డుకట్ట వేయాలని కొందరు ఆన్‌లైన్‌లో దొరికే రకరకాల యాప్‌లను వాడుతుంటారు. అవి ఓపెన్ చేయగానే బ్యాంక్ ఎకౌంట్‌లు, వ్యక్తిగత సమాచారం కేటుగాళ్ల చేతిలోకి పోయే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ‘డు నాట్ డిస్టర్బ్(డీఎన్డీ)’ యాప్‌ను అందుబాటులో ఉంచింది. ఇది సెల్‌ఫోన్‌కు స్పామ్ కాల్స్, సందేశాలు రాకుండా ‘స్పామ్ షీల్డ్’లా పనిచేస్తుంది. మొబైల్ నుంచి 1909కి సందేశం పంపడం లేదా కాల్ చేయడం ద్వారా వీటిని కట్టడి చేసే అవకాశం ఇప్పటికే ఉన్నా యాప్‌లో మనకు నచ్చిన వాటిని బ్లాక్ చేసే, ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం ఉంది.
ఎలా ఉపయోగించాలంటే...
గూగుల్ ప్లే స్టోర్ లేదా ఉమంగ్, యాప్ స్టోర్‌లో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫోన్ నంబరుతో లాగిన్ అవ్వాలి. డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. ‘ఛేంజ్ ప్రిఫరెన్స్’ ఆప్షన్‌లోకి వెళ్తే అక్కడ మీరు ఏ కాల్స్ స్వీకరించాలనుకుంటున్నారో, ఏవి వద్దనుకుంటున్నారో ఎంచుకోవచ్చు. తర్వాత కనిపించే ‘డీఎన్డీ కేటగిరీ’లో బ్యాంకింగ్, ఆర్థికానికి సంబంధించినవి, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డులు, రియల్ ఎస్టేట్, విద్య వంటి కొన్ని రకాల కాల్స్‌ను బ్లాక్ చేయడానికి అనుమతులు కనిపిస్తాయి. అందులో కేవలం ఫోన్‌కాల్స్‌ను మాత్రమే ఆపాలనుకుంటున్నారా లేదా సందేశాలను బ్లాక్ చేయాలనుకుంటున్నారా అని కూడా నిర్ణయించుకోవచ్చు. ‘ఫ్రాడ్ కాల్స్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి అక్కడ అడిగిన సమాచారమిచ్చి మోసపూరిత కాల్స్, సందేశాలపై ఫిర్యాదు చేయవచ్చు.
0 Comments