GET MORE DETAILS

వృశ్చికరాశిలో బుధుడి సంచారంతో త్రి ఏకాద‌శ యోగం. ఈ మూడురాశులకు గోల్డెన్ డేస్‌..!

 వృశ్చికరాశిలో బుధుడి సంచారంతో త్రి ఏకాద‌శ యోగం. ఈ మూడురాశులకు గోల్డెన్ డేస్‌..!



జ్యోతిష‌శాస్త్రం ప్ర‌కారం గ్ర‌హాల క‌ద‌క‌లిక‌కు ప్రాముఖ్యం ఉన్న‌ది. వాటి క‌ద‌లిక ప‌లురాశుల‌వారిపై ప్ర‌త్యేక ప్ర‌భావాన్ని చూపుతాయి. గ్ర‌హాల క‌ద‌లిక‌, సంయోగంతో ప‌లు శుభ‌యోగాలు ఏర్ప‌డుతాయి. అక్టోబ‌ర్ 30న సాయంత్రం 6.23 గంట‌ల‌కు బుధుడు, య‌ముడు 60 డిగ్రీల కోణంలోకి వ‌చ్చారు. దాంతో త్రిఏకాద‌శ‌ యోగం ఏర్ప‌డింది.జ్యోతిష‌శాస్త్రం ప్ర‌కారం.. గ్ర‌హాల క‌ద‌క‌లిక‌కు ప్రాముఖ్యం ఉన్న‌ది. వాటి క‌ద‌లిక ప‌లురాశుల‌వారిపై ప్ర‌త్యేక ప్ర‌భావాన్ని చూపుతాయి. గ్ర‌హాల క‌ద‌లిక‌, సంయోగంతో ప‌లు శుభ‌యోగాలు ఏర్ప‌డుతాయి. అక్టోబ‌ర్ 30న సాయంత్రం 6.23 గంట‌ల‌కు బుధుడు, య‌ముడు 60 డిగ్రీల కోణంలోకి వ‌చ్చారు. దాంతో త్రిఏకాద‌శ‌ యోగం ఏర్ప‌డింది. 

తెలివితేట‌లు, తార్కికం, విద్య‌, వ్యాపారాల‌కు కార‌కుడైన బ‌ధుడు త‌న రాశిచ‌క్రం మార్పు స‌మ‌యంలో ఇత‌ర గ్ర‌హాల‌తో క‌లిసి శుభ‌యోగాన్ని ఏర్ప‌రుస్తుంటాడు. ప్ర‌స్తుతం బుధువు వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఇప్ప‌టికే కుజుడు సైతం అదే రాశిలో ఉండ‌డంతో ప్ర‌భావం మ‌రింత ప్ర‌భావ‌వంతంగా ఉంటుంది. బుధుడు, య‌మ‌డితో క‌లిసిన స‌మ‌యంలో త్రిఏకాద‌శ‌ యోగం ఏర్ప‌డింది. ఇది ప‌లువురి రాశుల‌వారి జీవితాల్లో లాభం, విజ‌యం, ఆర్థిక పురోగ‌తిని తీసుకురానున్న‌ది.

మేషరాశి

మేష రాశి వారికి బుధుడు-యమ త్రిఏకాద‌శ‌ యోగం చాలా శుభప్రదం. ప్రస్తుతం, బుధుడు ఎనిమిదవ ఇంట్లో, యముడు పదవ ఇంట్లో ఉండ‌డంతో మీ ప్ర‌య‌త్నాల్లో సానుకూల ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయి. మీరు ప్రతి అడుగులోనూ కుటుంబం, స్నేహితుల నుంచి మ‌ద్ద‌తు పొందుతారు. ఇది మీ వృత్తి జీవితం, వ్య‌క్తిగ‌త జీవితంలోనూ ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు ఊపందుకుంటాయి. మీ కృషికి త‌గ్గ ఫ‌లితం వ‌చ్చే అవకాశం ఉంది. కుజుడు సైతం ఈ రాశిపై సానుకూల ప్రభావాన్ని చూప‌నున్నాడు. ప‌ని చేసే చోట పురోగ‌తిని సాధించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సూర్యుడి ప్ర‌భావంతో మీ కెరీర్ వృద్ధి చెంద‌డంతో పాటు సోష‌ల్ స్టేట‌స్ పెరుగుతుంది.

తుల‌రాశి

తుల రాశి వారికి ఈ సమయంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. సంప‌ద పెరుగుతుంది. బుధుడు మీ జాత‌కంలోని రెండో ఇంట్లో సంచ‌రిస్తున్నాడు. మీ వాగ్ధాటి, కమ్యూనికేషన్ నైపుణ్యంతో సామాజిక జీవితంలో విజ‌యం సాధిస్తారు. ఈ స‌మ‌యం విద్యార్థులకు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యారంగంలో సానుకూల ఫలితాలు చూస్తారు. బంధువులతో సంబంధాలు బాగుంటాయి. ఊహించని ఆర్థిక లాభాలు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. అదనంగా, వాహనం, గృహ సంబంధిత సౌకర్యాలు పెరిగే అవకాశాలు గోచ‌రిస్తున్నాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ యోగంలోని కేంద్ర దృష్టి యోగం కార‌ణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో ప‌నిచేసే చోట తోటి వారికి గ‌ట్టి పోటీని ఇస్తారు. మీ తెలివి తేట‌ల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. మీ ప్ర‌తిష్ట పెరుగుతుంది. ఉద్యోగులు ప్ర‌మోష‌న్ సాధించే అవ‌కాశం ఉంది. అలాగే వ్యాపారం, ఆర్థిక విషయాల్లో లాభాలు పొందే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మీ మేధో సామర్థ్యాలు పెరుగుతాయి. ఊహించని ఆర్థిక లాభాలు చూస్తారు. మీ జీవితంలో శాంతి, ఆనందం నెలకొంటాయి. మీ కృషిని గుర్తిస్తారు.

Post a Comment

0 Comments