GET MORE DETAILS

శివునికి నేతితో అభిషేకం ఎందుకు చేస్తారు ?

 శివునికి నేతితో అభిషేకం ఎందుకు చేస్తారు ?



వంశం పెరగడం ఐశ్వర్యం. ఐశ్వర్యాన్ని గృహస్థాశ్రమంలో అపేక్షించడం దోషం కాదు. అంతరంలో ఒక గొప్ప రహస్యం ఉన్నది. ముందు మనసు సత్త్వగుణ ప్రధానం అవ్వాలి. 

పరిశుద్ధమైన మనస్సు ఆ తర్వాత పెద్దల మాటలు వినగా వినగా విషయాలలో సుఖం లేదనే భావన వల్ల కలిగిన వైరాగ్యమనే అగ్నిహోత్రం చేత కాగి భక్తితో ఎర్రని తెట్టు కడితే, శాస్త్ర వచనం అన్న పెరుగు తెచ్చి కలిపి లోపల కదలకుండా నిలబెడితే, ఆ ధ్యానంలో అది తోడుకుంటే అందులో కవ్వం పెట్టి తిప్పి భగవంతుని రూప, గుణ, విభూతులను అనుభవించడానికి మననం చేస్తే, అందులో నుండి వెన్న పుడితే, ఈశ్వరుని వదిలి ఉండలేం అన్న తాదాత్మ్యత బుద్ధి పుడితే, నీటిలో తేలుట, అగ్ని తగిలితే కరుగుట, అనే నేతి స్వభావం పొందితే ఆవచ్చిన నేయిని తపస్సుచే అపరోక్షానుభూతిగా మార్చుకుని, ఇక్కడే ఇప్పుడే పరబ్రహ్మంగా నిలబడగలిగిన స్థితి ఇయ్యమని అడగడం చేతకాదని తెలుసుకోవాలి. బాహ్యంలో ఐశ్వర్యాన్ని అడుగుట కొరకు నేతితో అభిషేకం. పంచామృతాలలో నెయ్యి శివలింగానికి అభిషేకం చేసి అద్వైత స్థితిలో అపరోక్షానుభూతి అడగడం.

Post a Comment

0 Comments