శివునికి తేనెతో అభిషేకం ఎందుకు చేస్తారు ?
తేనె ఎంత తాగినా చాలా బాగుంది అనిపిస్తుంది. మనసు తీరదు. విషయాలను అది అనుభవిస్తే బాగుండు, ఇది అనుభవిస్తే బాగుండు అనిపిస్తుంది. ఎన్ని అనుభవించినా దాని వలన వచ్చే ప్రయోజనం శూన్యం. ఈ వైరాగ్య భావన రమ్మని అంటే వచ్చేది కాదు. విషయాలను అనుభవించడం అంటే శరీరానికి, మనసుకు అంత ప్రీతి. అందుచేత ఎవరు ద్వంద్వాలను అతిక్రమించి విషయాలను విడిచిపెట్టి విషయాలతో సంబంధం లేకుండా ఉండాలి అంటే విషాన్ని కంఠంలో ఉంచుకున్న వాని పాదాల వైపుకు నడవాలి. విషయాల పట్ల తిరస్కార భావం అంత తొందరగా రాదు. ఈ భావన పోవాలంటే స్వామికి తేనెతో అభిషేకం చేస్తారు. తేనెతో అభిషేకం వలన వచ్చేది అపారమైన తేజస్సు. అంతరంలో తేనెను అభిషేకం చేయడం చేత విషయ పిపాస విరిగిపోయి వైరాగ్య భావన అంకురిస్తుంది.

0 Comments