GET MORE DETAILS

మన ఆరోగ్యం - పాలిష్ బియ్యం తినడం మానుకోవడం మంచిది..!

మన ఆరోగ్యం - పాలిష్ బియ్యం తినడం మానుకోవడం మంచిది..!

          


ఎప్పటి నుండైతే మనిషి రైస్ మిల్లులను కనుక్కున్నాడో అప్పటి నుంచి బియ్యాన్ని పాలిష్ పట్టడం మొదలుపెట్టాడు. ఎర్రటి బియ్యాన్ని పాలిష్ మరలో పోస్తే, ఆ మిల్లు ఆ బియ్యంపై ఒక పొరను చెక్కేస్తుంది. ఆ చెక్కగా వచ్చిన పై పొట్టును మొదటి పాలిష్ అంటారు.                 

ఈ పై పొరలో, బియ్యంలో ఉండే ‘అతి ముఖ్యమైన పోషక పదార్థాలు 50 శాతం వరకూ పోతాయి’. 

అవి ముఖ్యంగా 12 రకాలు. 

◾బి విటమిన్ల సముదాయం, విటమిన్-ఇ, పీచు పదార్థాలు, లిసిథిన్ మొదలైనవి ఈ మొదటి పాలిష్ లో అన్నీ ముఖ్యమైన పోషకాలే ఉన్నాయి.

◾అందుకే ఆ తౌడును మందుల కంపెనీల వారు కొనుక్కొని మందుల తయారీకి వాడతారు. ఈ తౌడునే ఖాళీ గొట్టాలలో పోసి, బలానికి గొట్టాలుగా తయారు చేసి మనకి అమ్ముతారు. మొత్తం తౌడునే కాకుండా ఆ గొట్టాలలో నిల్వ ఉండడానికి, రంగుకు, వాసనకు కొన్ని మందులను కలిపి తయారు చేస్తారు.

◾తెల్లటి బియ్యం తిని బి-కాంప్లెక్స్ గొట్టాలు వేసుకోవడం ప్రజలకు తేలికగా ఉంది కదూ.

◾ఈ మొదటి పాలిష్ తౌడును బలానికని పాలల్లో వాడే పొడుల్లో, ఇతర బలవర్దకమైన ఆహార పదార్థాలలో కలుపుతూ ఉంటారు. 

◾మొదటి పాలిష్ పోగా వచ్చిన బియ్యం కొద్దిగా తెలుపే తప్ప పూర్తిగా తెలుపు రావు. అందుచేత ఈ బియ్యాన్ని మళ్లీ పాలిష్ కోసం మరలో పోస్తారు. దాంతో పెద్ద పొరను మిల్లులు దొలిచేస్తాయి. ఈ సారి తెల్లగా మెరిసిపోతూ వస్తాయి.     

◾ఇలా రెండవసారి వచ్చిన తౌడును (30 శాతం పోషక పదార్థాలుంటాయి) గేదెలకు,ఆవులకు, ఇతర పశువులు, చేపలకు, రొయ్యలకు బలానికి వాడతారు, ఆ తెల్ల బియ్యాన్ని మాత్రం వాడుకునేందుకు మనం ఉంచుకుంటాం.

ఈ తౌడులోఉండే పోషకాలు:

• Thiamine(B),

• Riboflavin(B), 

• Niacin, 

• Pyridoxine (B) 

• Pantothenic acid,  

• Biotin, 

• Choline, 

• Folic acid, 

• Inositol, 

• Zinc, 

• Iron, 

• Manganese, 

• Copper, 

• lodine.

తెల్లటి బియ్యంతో నష్టాలెన్నో...

తెల్లటి బియ్యాన్నిఎన్నో సంత్సరాలుగా తింటూ శరీరానికి ఎంతో నష్టాన్ని కలిగించుకుంటున్నాం. తెల్లటి బియ్యం వల్ల నష్టాలను తెలుసుకుందాం.

1) బియ్యంలో ఉండే 12 రకాల B విటమిన్స్ 80 శాతానికి పైగా కోల్పోయి, కేవలం 15, 20 శాతం మాత్రమే మిగులుతాయి.

2) శరీరానికి బలాన్నిచ్చే B విటమిన్లు సరిగా లేకుండా ఉన్న తెల్లటి అన్నాన్ని తిన్నందున ఎక్కువగా అలసిపోవడం, త్వరగా నీరసం రావడం, పిక్కలు లాగడం, కష్టపడి పనిచేయలేక పోవడం మొదలైనవన్నీ వస్తాయి.

▪️ఉదాహరణకు మన ఇళ్లలో ఇప్పుడున్న 70, 75 సంవత్సరాల ముసలివారికున్న ఓపిక 50 సంవత్సరాల వారికి లేదు.

▪️అలాగే 50 సంవత్సరాల వారికున్న ఓపిక 25, 30 సంవత్సరాల వారికి లేదు. ఇక వీరికున్న ఓపిక చిన్న పిల్లల్లో లేదు. 

▪️దీనికి కారణం చూస్తే తెల్లటి బియ్యాన్ని తినడం అని స్పష్టంగా తెలుస్తున్నది.

3) పై పొరలో విటమిన్ E అనేది ఉంటుంది. ఇది త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది, తెల్లటి బియ్యంలో ఇది పూర్తిగా ఉండదు.

4) లిసిధిన్ అనే పదార్థం తెల్లటి బియ్యంలో ఉండదు. ఈ పదార్థం మనలో కొవ్వు, (కొలెష్ట్రాల్) పదార్థాలు పేరు కోకుండా నివారించేందుకు కొవ్వుకు విరుగుడుగా పని చేస్తుంది. 

▪️తెల్లటి బియ్యం తినేవారికి ఈ రక్షణ శరీరంలో ఉండదు. 

▪️గుండె జబ్బులు రాకుండా నివారించే శక్తి తెల్లటి బియ్యంలో ఉండదు.

5) పీచుపదార్థాలన్నీ బియ్యం పై పొరలలో ఉండడం వల్ల, తెల్ల బియ్యంలో పీచు లేనందువల్ల మలబద్ధకం వస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గదు.

6) తెల్లటి బియ్యం తినేవారు ఎక్కువ బరువు పెరుగుతారు. ఈ బియ్యంలో పీచు పదార్థాలు లేనందు వల్ల తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి, రక్తం లోనికి ఒకేసారి చేరిపోతుంది. 

▪️దాంతో శరీరం ఈ శక్తి అంతటిని కొవ్వుగా మార్చి వేస్తుంది. ఫలితంగా మధుమేహ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది 

▪️అదే పీచు పదార్థాలుంటే ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి.

7) తెల్లటి అన్నం మెతుకులు సన్నగా ఉండే సరికి, సరిగా పంటి కింద పడక, నమలకుండా తేలిగ్గా జారి గొంతులోకి వెళ్లిపోతూ ఉంటాయి. 

▪️నమలనందుకు నోటిలో గానీ, పొట్టలో గాని జీర్ణక్రియ సరిగా ఉండదు.

8) శరీరానికి ఎక్కువ సేపు వరకూ, ఎక్కువ శక్తిని సమకూర్చలేదు. తిన్న 3, 4 గంటలలోనే నీరసం వచ్చేట్లుగా చేస్తుంది.

9) తెల్లటి బియ్యం తినడం వల్ల B కాంప్లెక్స్ గొట్టాలు, బలానికి టానిక్కులు తాగాల్సిన స్థితిని మనమే శరీరానికి కలిగిస్తున్నాం.

10) కాళ్లకు నీరు పట్టడం, తిమ్మిర్లు రావడం లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి.

11) తెల్లటి బియ్యంలో తేలిగ్గా జీర్ణమయ్యే కొవ్వు పదార్థాలు ఉండవు. తౌడులోకి ఈ కొవ్వు పదార్థాలు వెళ్లి పోతున్నాయిగా. 

▪️ఈ ఉపయోగపడే కొవ్వు పదార్థాలు హాని లేకుండా శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి. కానీ తెల్లబియ్యం తినే వారికి ఈ శక్తి లోపిస్తుంది.

12) తెల్లటి అన్నం రుచి ఉండదు, చప్పగా ఉంటుంది. పచ్చళ్ల తో తినాలినిపించే విధంగా చప్పదనం వుంటుంది.

▪️బలాన్నిచ్చే దంపుడు బియ్యం, తౌడుకు 10, 15 రోజుల్లో పురుగులు పట్టేస్తాయి. 

▪️ముడి బియ్యంలో అయితే 2,3 నెలలైనా గానీ పురుగు పట్టదు. 

▪️అదే తెల్లటి బియ్యాని కైతే 7,8 నెలలైనా పురుగు పట్టదు.

Post a Comment

0 Comments