360 వత్తులను ఎప్పుడు వెలిగించాలి ?
▫️పుణ్యక్షేత్రాల్లో ఎప్పుడైనా వెలిగించవచ్చు.
▫️కార్తికమాసంలో పౌర్ణమినాడు వెలిగించడం శ్రేష్ఠం.
▫️ఆలయాల్లో, దీపోత్సవాల్లో వెలిగించవచ్చు.
▫️ఇంటివద్ద వెలిగించినప్పుడు సాధారణంగా ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశినాడు, పౌర్ణమి నాడు తులసికోట వద్ద వెలిగిస్తారు.
▫️వీలుకానివారు కార్తికమాసంలో ఏదో ఒక రోజున వెలిగించుకోవచ్చు.
▫️360 వత్తులను ముందుగా ఆవునేతిలో తడిపి సిద్ధం చేసుకోవాలి.
▫️మనకు ఉన్న తిథులు మొత్తం 15. నెలకు 30 తిథులు. నెలలు మొత్తం 12. రోజుకు ఒకటి చొప్పున 360 వత్తులు సంవత్సరానికి సంకేతానికి నిలుస్తాయి.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు - లోకా సమస్తా సుఖినోభవన్తు!

0 Comments