నవంబర్ 20 వరకు ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు. బుధ అనుగ్రహంతో డబ్బు, విజయాలతో పాటు ఎన్నో!
బుధుడు నవంబర్ 20 వరకు అనురాధ నక్షత్రంలో సంచారం చేస్తాడు. ఈ సమయంలో బుధ గ్రహం కొన్ని రాశుల వారికి శుభఫలితాలను తీసుకు వస్తుంది. పై అధికారుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. సంతోషం, ప్రశాంతత, డబ్బు కలుగుతాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మరి మీకూ కలిసి వస్తుందా? గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తాయి.
ఆ సమయంలో మంచి యోగాలు, చెడ్డ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యోగాల ప్రభావం ద్వారా వారి జీవితంలో అనేక విధాలుగా మార్పులు వస్తాయి. బుధుడు నవంబర్ 20 వరకు అనురాధ నక్షత్రంలో సంచారం చేస్తాడు. ఈ సమయంలో బుధ గ్రహం కొన్ని రాశుల వారికి శుభఫలితాలను తీసుకు వస్తుంది.గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారకుడు. బుధుడు ఎప్పటికప్పుడు రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. దీంతో రాశులపై నేరుగా ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు మంచి ఫలితాలను పొందుతారు.
అనురాధ నక్షత్రంలోకి బుధుడు
బుధుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు మంచి ఫలితాలను ఎదుర్కొంటారు. పై అధికారుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. సంతోషం, ప్రశాంతత, డబ్బు కలుగుతాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
అనురాధ నక్షత్రంలో బుధుడు. నవంబర్ 20 వరకు ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు
1. మిధున రాశి:
మిధున రాశి వారికి బుధ సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ఇది శుభసమయం. ఆర్థికపరంగా బాగుంటుంది. ప్రేమ జీవితం సంతోషంగా సాగుతుంది.
2. కన్య రాశి:
కన్య రాశికి అధిపతి బుధుడు. బుధుని అనుగ్రహంతో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. జీతం కూడా పెరగవచ్చు. వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు పనిలో ఏకాగ్రత పెడతారు, సక్సెస్‌ను అందుకుంటారు. సంతోషం, ప్రశాంతత, డబ్బు కలుగుతాయి.
3. మకర రాశి:
మకర రాశి వారికి బుధుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థికపరంగా లాభాలను పొందుతారు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అప్పులు తీరుతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. పై అధికారుల నుంచి సపోర్ట్ లభిస్తుంది.

0 Comments