GET MORE DETAILS

ధనదీపం - ఖర్చులు తగ్గి సంపద పెరగాలంటే కార్తీక మాసంలో ధనదీపం వెలిగించాల్సిందే..!

ధనదీపం - ఖర్చులు తగ్గి సంపద పెరగాలంటే కార్తీక మాసంలో ధనదీపం వెలిగించాల్సిందే..! 



కార్తీక మాసంలో అఖండ ధన లాభం కలగటానికి, అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి, ఖర్చులు తగ్గటానికి ధన దీపాన్ని లేదా లక్ష్మి దీపాన్ని వెలిగిస్తారు.

ఐశ్వర్యం కలగాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, అప్పులు తీరిపోవాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, మొండి బాకీలు తొందరగా వసూలు కావాలన్నా కార్తీక మాసంలో తప్పకుండా ప్రతీ ఇంట్లో ధన దీపాన్ని వెలిగించాలి. కార్తీక మాసంలో వచ్చే ఏ రోజైనా ధన దీపాన్ని వెలిగించుకోవచ్చు. లేదా ప్రత్యేకంగా కార్తీక మాసంలో వచ్చే "గురువారం లేదా శుక్రవారం" రోజున ఈ ధన దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.

ఈ ధనదీపాన్ని ఎలా వెలిగించాలో తెలుసుకుందాం:

మీ ఇంట్లో పూజ గదిలో గజలక్ష్మిదేవి ఫోటో లేదా ధనలక్ష్మి దేవి ఫోటోకు దండ, బొట్లు పెట్టి పీట ఏర్పాటు చేసుకోవాలి. పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, పీట మీద బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గులు అష్టదళ పద్మం ముగ్గు. 8 దళాలున్న పద్మం ముగ్గు అంటే లక్ష్మీ దేవికి ఇష్టం. స్వస్తిక్ గుర్తు ముగ్గు కూడా లక్ష్మీదేవికి ఇష్టం. కాబట్టి ఆ పీఠం మీద అష్ట దళ పద్మం ముగ్గు లేదా స్వస్తిక్ గుర్తు ముగ్గు వేయండి.

అలా ముగ్గులు వేశాక పీటమీద ఒక రాగి లేదా ఇత్తడిపళ్లెం ఏర్పాటు చేయాలి. అందులో 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత రాగి లేదా ఇత్తడి పళ్లెంలో బియ్యాన్ని కుప్పలాగా పోయాలి. అందులో చిటికెడు పసుపు, కుంకుమ వేయాలి. ఒక గులాబీ పువ్వు కూడా పెట్టాలి. కొన్ని రూపాయి నాణెలు కనీసం 11 నాణేలు ఆ బియ్యంలో ఉంచాలి.

రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి. వాటికి కుంకుమ బొట్లు అలంకరించుకోవాలి.  రాగి లేదా ఇత్తడి పళ్లెంలో ఉన్న బియ్యంలో మొదటి ప్రమిదను ఉంచాలి. అందులో మూడు యాలకులు, మూడు లవంగాలు, ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు పోయాలి. అలా పోసిన తర్వాత మొదటి ప్రమిదలో రెండవ చిన్న ప్రమిదను ఉంచాలి. ఆ రెండవ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి రెండూ లేదా మూడు ఒత్తులు వేసి ఏకహారతితో కానీ ఆగరబత్తితో కానీ వెలిగించాలి. 

దీనినే ధనదీపం లేదా లక్ష్మీదీపం అని పిలుస్తారు.

Post a Comment

0 Comments