నిత్య నూతనం వందేమాతరం
భారత జాతికి నిత్యస్పూర్తి మంత్రం వందేమాతరం గీతం. భారతమాతను గొప్పగా కీర్తించే అమోఘమైన గేయం 'వందేమా తరం'. ఇది మన దేశ జాతీయ గేయం. వందేమాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ సంద ర్భంగా ఇవాళ 150వ వార్షికోత్స వాన్ని జరుపుకుంటున్నాం. అవ మానం నుంచి ఉద్భవించిన ఆవేశం ఆ అక్షరాలు ఆగ్నికణాలై స్వేచ్ఛా పిపాసను రగిలించాయి. సమరయో ధులకు స్పూర్తి మంత్రమై, స్వాతం త్రీయ సమరానికి శరమై, నేటికీ దేశ భక్తిని, ఐక్యతను సుస్థిరం చేస్తోంది. స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చింది. సామాన్యులనూ సమరయోధులుగా మార్చింది. 1875 నవంబరు 7 ఈ రోజున బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ్ తన కలంతో భారత మాతకు ఆక్షరార్చనగా వందేమాతరం గేయాన్ని సమర్పించారు. డిప్యూటీ మేజిస్ట్రేట్గా బ్రిటిష్ సేవలో ఉన్న ఆయనపై ఒక తెల్లజాతి అధికారి చేసిన అవమానం ఆ గీతం ఆవిర్భవించడానికి నాంది పలికింది.
"గాడ్ సేవ్ ద కింగ్"ను జాతీయ గీతంగా చేయాలన్న వలస పాలకుల యత్నం ఆయనను మరింత కుదిపేసింది. అప్పుడు ఆయన కలం నుంచి జాలువారిన ఆ పదాలు "సుజలాం సుఫలాం మలయజ శీతలాం మాతరం" భారత భూమిని దేవతగా భావించిన ఆత్మనినా దమయ్యాయి. 1882లో ప్రచురితమైన ఆనందమఠ్ నవలలో ఈ గేయం చోటు దక్కింది. ఆ నవలకూ, ఆ గేయానికీ ప్రేరణగా 1770 కరువు నేపథ్యంలో జరిగిన హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్ల తిరుగుబాట్లు నిలిచాయి. దేశభక్తిని, జాతీయతను రగిల్చిన సాహిత్య స్రవంతిగా బంకిమ్చంద్ర భారత సాహిత్యానికి కొత్త దిశ చూపారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1886లో కలకత్తా కాంగ్రెస్ సభలో " స్వయంగా దీనికి స్వరపరిచారు. 1905 లో బెంగాల్ విభజన సమయంలో వందేమాతరం స్వదేశీ ఉద్యమానికి కరదీపికగా మారింది. 1908లో ఉరిశిక్షకు గురైన కుదిరామ్ బోస్ చివరి నిమిషంలో “వందేమాతరం" అంటూ చిరునవ్వుతో ఉరికొయ్యవైపు నడిచాడు. 1907లో రాజమహేంద్రవరం విద్యార్థులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు నేతృత్వంలో మొదటిసారిగా వందేమాతరాన్ని ఊరేగింపుగా వెడుతూ పాడారు. ప్రిన్సిపల్ హంటర్ ఆయనను కాలేజీ నుంచి బహిష్కరించగా విద్యార్థుల్లో ఆగ్రహం రేగింది. గ్రామాల్లో వందేమాతరం సంఘాలు ఏర్పడ్డాయి.
ఆ సమయంలో చిన్నపరెడ్డి అనే రైతు ఇంగ్లీషు అధికారిపై తిరుగుబాటు చేయడం, ఉరిశిక్షకు గురవడం ఈ గేయం ప్రభావం ఎంత లోతుగా ఉందో చూపించింది. తెలంగాణ లోనూ 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు వందేమాతరాన్ని పాడడంతో ఉద్య మం మొదలైంది. నిజాం జమానా వణికిపోయింది. బహిష్కరణలు, నిరసనలు కొనసాగాయి. ఆ విద్యార్థుల్లో పీవీ నరసింహరావు కూడా ఉన్నారు. బ్రిటిష్ పాలకులు దీన్ని నిషేధించినా, భారత మానసిక స్వాతంత్ర్యాన్ని ఆపలేకపోయారు. 1947 ఆగస్టు 15 ఉదయం పార్లమెంటులో ఓమ్ ప్రకాశ్ వందేమాతరం గీతాన్ని ఆలపించారు. రాజ్యాంగ సభ 1950లో దీనికి జనగణమ నతో సమాన హోదా ఇచ్చింది. ఇది కేవలం ఒక గీతం కాదు. ఇది భారత ఆత్మయొక్క ప్రతి ధ్వని. అసతోమా సద్గమయ, సత్యమేవ జయతే వంటి వాక్యాల తరహాలోనే వందేమాతరం కూడా శాశ్వత భారత జాతీయతను మేల్కొలిపే మంత్రగీతం. 'వందేమాతరం' కూడా ఒక ఆత్మనినాదం, ఒక శాశ్వత జాతీయ గీతం భారత గుండెల్లో ఎప్పటికీ మార్మోగిపోతూనే ఉంటుంది.

0 Comments