శక్తినిచ్చే గ్రీన్ టీ: సామర్థ్య పెంపునకు దోహదం
గ్రీన్ టీ జీర్ణక్రియ ఆరోగ్యానికి మంచిది. కానీ.. ఇది నిద్రలేమిని దూరం చేస్తుందని, శరీరంలో ఇన్ఫ్లమేషన్ (మంట)ను, వాపును తగ్గిస్తుందని, పురుషుల్లో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా లైంగిక సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ఈ పానీయం సహజ ఆరోగ్యాన్ని పెంపొందించే శక్తివంతమైన డ్రింక్ అంటున్నారు నిపుణులు.
30% పెరుగుతున్న సామర్థ్యం
చైనా మెడికల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 280 మంది పురుషులపై నిర్వహించిన అధ్యయన ఫలితాల ప్రకారం.. రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ తాగేవారు కొన్ని రకాల అనారోగ్యాలకు, మానసిక రుగ్మతలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా 20 ఏండ్లకు పైగా గ్రీన్ టీ తాగుతున్న వారిలో, 45 ఏండ్లు పైబడిన పురుషుల్లో గ్రీన్ టీ తాగడం వల్ల టెస్ట్లో స్టెరాన్ స్థాయిలు 30% పెరి గినట్టు అధ్యయనం కనుగొన్నది. టెస్టోస్టెరాన్ మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక ముఖ్యమైన సెక్స్ హార్మోన్. ప్రధానంగా ఇది పురు షులలో టెస్టిస్ (వృషణాలు)లో ఉత్పత్తి అవుతుంది. అయితే స్త్రీలలో కూడా అండాశ యాలు, అలాగే అడ్రినల్ గ్రంథులలో స్వల్ప మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. ఇది స్టెరాయిడ్ హార్మోన్ గ్రూప్ నకు చెందినది.
శరీర అభివృద్ధికి కూడా...
శరీర అభివృద్ధి, జననేంద్రియ ఆరోగ్యంతో పాటు మొత్తం మానవ జీవక్రియలోనూ టెస్టోస్టెరాన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి ఒక ముఖ్యమైన హార్మోన్ గ్రీన్ టీ తాగడంవల్ల మరింత మెరుగవుతుం దని నిపుణులు చెబుతున్నారు. అంతేకా కుండా డైలీ వన్ కప్ గ్రీన్ టీ తాగడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందని, నాణ్యమైన నిద్రను మెరుగు పరుస్తుం దని, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా తగ్గుతాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఇక స్త్రీల విషయానికి హర్మోనల్ బ్యాలెన్స్ను మెరుగు పర్చడంలో గ్రీన్ టీ తాగడం సహాయపడుతుందని తెలిపింది.

0 Comments