GET MORE DETAILS

మన ఇతిహాసాలు - బలరాముడు

మన ఇతిహాసాలు - బలరాముడు



బలరాముడు, బలదేవుడు లేదా బలభద్రుడు, వీరు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులగా జన్మించిన అంశావతారము. వీరి ఆయుధము హలము, నాగలి.

◾వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడుగా ఉన్నవారు. వీరి భార్య రేవతి.

◾ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశ మార్చారు, మరొకసారి హస్తినాపురాన్నే నేటి ఢిల్లీని తన హలాయుధంతో యమునలో కలప ఉద్యుక్తులయినారు.

◾వీరు కురుక్షేత్ర యుద్దమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేసారు. అప్పుడు దర్శించిన ప్రదేశాలలో తిరుమల కూడా ఉంది.

బలరాముని కి గల పేర్లు

• బలభద్రుడు

• ప్రలంభఘ్నుడు

• బలదేవుడు

• అచ్యుతాగ్రజుడు

• రేవతీరమణుడు

• కామపాలుడు

• హలాయుధుడు

• నీలాంబరుడు

• రోహిణేయుడు

• తాలాంకుడు (తాటి చెట్టు గుర్తు కలవాడు)

• సంకర్షణుడు (ఒక గర్భము నుండి మరియొక గర్భమునకు లాగబడిన వాడు)

• సీరపాణి

• కాళినేఛేదనుడు (కాళిందిని భంగ పరచినవాడు)

◾భీమదుర్యోధనులిద్దరూ ఆయనకి గదాయుద్ధంలో శిష్యులు. వాస్తవానికి భీముడికన్నా దుర్యోధనుడికే గదాయుద్ధంలో కాస్త ప్రావీణ్యం ఎక్కువ. 

◾భారత యుద్ధంలో తనకి కౌరవపాండవులిద్దరూ సమానమే కాబట్టి తటస్థంగా ఉంటాడు. యుద్ధంలో ఎవరి పక్షమూ వహించక తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. 

◾కొన్ని విషయాల్లో శ్రీకృష్ణునితో ఏకీభవించకపోయినప్పటికీ, ఆయనను అతిక్రమించి మాత్రం ప్రవర్తించలేదు. ఇక్కడే బలరామునిలో ప్రకృతి తత్త్వం కనిపిస్తుంది.

Post a Comment

0 Comments