GET MORE DETAILS

చలికాలంలో ఉదయపు ఎండ మీ బ్లడ్ ప్రెజర్ను తగ్గిస్తుందని తెలుసా?

చలికాలంలో ఉదయపు ఎండ మీ బ్లడ్ ప్రెజర్ను తగ్గిస్తుందని తెలుసా?



ప్రతిరోజూ కాసేపు ఉదయం పూటలేలేత ఎండకు గురికావడం వల్ల విటమిన్ డి సహజంగానే లభిస్తుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదే సందర్భం లో సూర్యకాంతి మీ బ్లడ్ ప్రెజర్ ను నియంత్రిస్తుందని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని తెలుసా? ఎడిన్బర్గ్ యూనివర్సిటీ డెర్మటాలజిస్ట్ డాక్టర్ రిచర్డ్ వెల్లర్ నేతృత్వంలో జరిగిన పరిశోధనలు ఈ విషయా న్ని ధ్రువీకరించాయి. సూర్యరశ్మి మీ శరీరంలో విటమిన్ డి ఉత్పత్తిని చేయడం మాత్రమేకాకుండా, మానసిక స్థితిని, ఇమ్యూన్ సిస్టమ్ ను, రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. అంతేకాకుండా బాడీలో హానికారక సూక్ష్మజీవులను చంపే ప్రోటీన్లను అంటే యాంటీ మైక్రోబయల్ వెటైడ్స్ ను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది.

అనేక మెటా-ఎనాలిసిస్ అధ్యయనాలు విటమిన్ D సప్లిమెంటేషన్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల రిస్క్ ను తగ్గిస్తుందని నిరూపించాయి. అదే సమయంలో సూర్యకాంతికి గురైనప్పుడు UVA కిరణాలు చర్మ కణాల్లో నైట్రిక్ ఆక్సైడ్ (NO) విడుదల చేస్తాయి. ఈ సిగ్నలింగ్ మాలిక్యూల్ రక్త నాళాలను రిలాక్స్ చేసి అవి విస్తరించేలా చేస్తుంది. దీని వల్ల రక్తప్రవాహం మెరుగుపడుతుంది. రక్తపోటు తగ్గుతుంది. ఇది గుండె జబ్బులు, చర్మ క్యాన్సర్ రిస్క్లను తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయం పూట 10 నుంచి 30 నిమిషాలు ఎండలో ఉండేలా చూసుకోవాలి. చలికాలంలో ఇది చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.

Post a Comment

0 Comments