Ads Area

ధర్మశాస్త్రం ప్రకారం గ్రహణం కంటికి కనిపిస్తేనే దానికి సంబంధించిన నియమాలు పాటించాలి.

0

ధర్మశాస్త్రం ప్రకారం గ్రహణం కంటికి కనిపిస్తేనే దానికి సంబంధించిన నియమాలు పాటించాలి.



దీనిని నిర్ణయసింధు మరియు ధర్మసింధు వంటి ధర్మ గ్రంధాలలో ఈ విధముగా పేర్కొన్నారు.

శ్లోకం: యస్మిన్ దేశే తు దృశ్యేత గ్రహణం తత్ర సూతకమ్ 

ఏ దేశంలో (ప్రాంతంలో) గ్రహణం కనిపిస్తుందో ఆ ప్రాంతంలో మాత్రమే గ్రహణ సూతకం వర్తిస్తుంది అలాగే నియమాలు వర్తిస్తాయి.

శ్లోకం: యదాతు గ్రస్త ఏవోదేతి తదా ఉదయసమయ ఏవ స్నానకాలః 

ఇక్కడ మనకి చంద్రుడు గ్రహణం పట్టిన స్థితిలోనే ఉదయిస్తున్నాడు కాబట్టి (గ్రస్తోదయం) ఆ ఉదయ సమయమే స్నానానికి సరైన సమయం

అంటే మధ్యాహ్నం 3:20 గంటలకే గ్రహణం ప్రారంభమైనా మనకు చంద్రుడు ఉదయించే వరకు ఆ గ్రహణ ప్రభావం మన ప్రాంతంపై ఉండదు అందుకే  చంద్రోదయ సమయాన్ని పట్టు కాలంగా తీసుకోవాలి అదే పంచాంగాలలో రాశారు.

అనగా పట్టు స్నానం 6:22 pm


ఇప్పుడు విడుపు స్నానం గురించి...

శ్లోకం: సర్వేషామేవ వర్ణానాం సూతకం రాహు దర్శనే 

తస్మాత్ స్నానం ప్రకుర్వీత ముక్తౌ తు విశేషతః 

గ్రహణ దర్శనం వల్ల అన్ని వర్ణాల వారికి ఆశౌచం (సూతకం) కలుగుతుంది కాబట్టి గ్రహణం పట్టినప్పుడు స్నానం చేయాలి విడిచిన తర్వాత (ముక్తి కాలంలో) కచ్చితంగా స్నానం చేయాలి

విడిపో స్నాన సమయం 6:47pm

గ్రహణం నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించవలసిందే.

అనగా ఆహార నియమాలు దేవాలయ సందర్శన ఇటువంటివి అన్నీ కూడా ఆయాసమయం లోపే పూర్తి చేసుకోవాలి.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area