ఉసిరితో బాల నెరుపు దూరం...
జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఉసిరి ముందుంటుంది. శిరోజా లను ఒత్తుగా చేయడమే కాదు, బాలపెరుపు వంటి సమస్యలను దరిచేరనివ్వదు అంటున్నారు నిపుణులు.
ఒత్తిడి, హార్మోన్ల అసమ తుల్యత, వాతావరణ కాలుష్యం వంటివి శిరో జాలు రాలడానికి కార ణాలు అవుతాయి. సి విటమిన్ సహా యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవ ణాలు, అమీనో యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఉసిరితో జుట్టుకు లెక్కలేనన్ని ప్రయో జనాలను అందించొచ్చు. చుండ్రును దూరం చేసి, జుట్టు కుదుళ్లను బలంగా ఉంచి, రక్తప్రసరణను మెరుగు పరిచి, ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేందుకు ఉసిరి దోహదపడుతుంది.
శీకాకాయతో.. శరీరం నుంచి వచ్చే వేడికి శిరోజాలు ప్రభావితం కాకుండా ఉసిరి మాడుకు చల్లదనాన్ని అందిస్తుంది. ఇందు లోని యాంటీ ఏజింగ్ గుణాలు బాలనెరుపు వంటి సమస్యలను దరికి చేరకుండా పరిరక్షి స్తాయి. తలకు స్నానం చేసేటప్పుడు మూడు ఉసిరికాయలను మెత్తని గుజ్జుగా చేసి రసం తీయాలి. లేదా ఉసిరి పొడిని రెండు మూడు చెంచాలకు మూడునాలుగు కుంకుడు కాయలు, నాలుగైదు శీకాకాయలను కలిపి నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని తలకు మృదువుగా రుద్ది తలస్నానం చేస్తే చాలు. శిరోజాలు రాలే సమస్యకు దూరంగా ఉండొచ్చు.
నిమ్మరసంతో.. రెండు ఉసిరికాయల రసానికి సమానపాళ్లలో నిమ్మరసాన్ని కలిపి మాడుకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే చాలు. జుట్టుకు కావాల్సిన పోషకాలను ఈ లేపనం అందించి మాడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరు మందార పువ్వుల్ని మెత్తని గుజ్జుగా చేసి అందులో నాలుగుచెంచాల కొబ్బరినూనె, చెంచా ఉసిరి పొడి కలిపి తలకు మర్దనా చేయాలి. 40 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం చేస్తే ఏ, బీ, సీ విటమిన్లు, ఫాస్ఫరస్, కాల్షియం వంటి ఖనిజలవణాలు, అమీనో యాసిడ్స్, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఈ లేపనంతో శిరో జాలు ఆరోగ్యవంతమవుతాయి. సీబమ్ ఉత్పత్తిని నియంత్రించి, జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. రక్తప్రసరణ మెరుగ్గా జరిగి శిరోజాలను రాల కుండా పరిరక్షిస్తుంది.
కరివేపాకుతో కలిపి.. రెండు ఉసిరికాయలను ముక్కలుగా కోసి మిక్సీపట్టాలి. ఇందులో గుప్పెడు కరివేపాకులు, రెండు చెంచాల నీటిని వేసి తిరిగి మెత్తగా చేసిన మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్లవరకు రాసి రెండు గంటలు ఆరనిచ్చి స్నానం చేయాలి. బీ6, సి విటమిన్లు సహా ప్రొటీన్లు, పీచు, అమీనో యాసిడ్స్ ఉన్న ఈ లేపనం జుట్టు పలచబడటాన్ని ఆపుతుంది. నల్లని నిగనిగలాడే శిరోజాలు పెరిగేలా చేస్తుంది.
.jpeg)
0 Comments