GET MORE DETAILS

ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ - కస్టమర్లకు ఎల్ ఐ సి అవకాశం

ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ - కస్టమర్లకు ఎల్ ఐ సి అవకాశం 



రద్దయిన జీవిత బీమా పాలసీలను (ల్యాప్స్ పాలసీలు) పునరుద్ధరించుకునేం దుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వరంగ ఎన్ఐసీ ప్రకటించింది. మార్చి 2 వరకు రెం డు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది. అన్ని నాన్ లింక్డ్ పాల సీలకు, ఆలస్యపు రుసుము (నిలిచిపోయిన కాలానికి సంబంధించిన ప్రీమియం పై)లో ఆకర్షణీయమైన తగ్గింపును ఇస్తున్నట్టు పేర్కొంది. ఆలస్యపు రుసుములో 30 శాతం, గరిష్టంగా రూ.5,000 తగ్గింపు పొందొచ్చని వెల్లడించింది. సూక్ష్మ జీవిత బీమా పాలసీలపై ఆలస్యపు రుసుమును పూర్తిగా మాఫీ చేస్తున్నట్టు తెలిపింది. పాలసీ కాల వ్యవధి (టర్మ్) ముగిసిపోకుండా, కేవలం ప్రీమియం చెల్లింపుల్లేక రద్దయిన పాలసీలకే పునరుద్ధరణ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. వైద్య/ఆరోగ్య అవసరాల్లో ఎలాంటి రాయితీలు ఉండవని పేర్కొంది. సకాలంలో ప్రీమి యంలు చెల్లించలేకపోయిన వారికి ఈ పునరుద్ధరణ కార్యక్రమం ప్రయోజనం కల్పిస్తుందని వివరించింది. పాలసీలను పునరుద్దరించుకుని, బీమా కవరేజీని తిరిగి పొందాలంటూ పాలసీదారులకు సూచించింది.

Post a Comment

0 Comments